నచ్చితే రూ.100ల టీషర్ట్‌ అయినా వేసుకుంటా : నటి

25 Jul, 2021 18:43 IST|Sakshi

రెజీనా.. ఆన్‌ స్క్రీన్‌ అయినా.. ఆఫ్‌ స్క్రీన్‌ అయినా సహజంగా కనిపించడానికే ఇష్టపడుతుంది. అదే ఆమె స్టయిల్‌ అయింది. ఆ శైలిని ట్రెండ్‌గా మార్చేసిన బ్రాండ్స్‌ ఏవంటే.. 

ఫారిన్‌ ఫ్యాషన్స్‌కు స్వదేశీ టచ్‌
అనుశ్రీ బ్రహ్మభట్‌.. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్‌ ప్రపంచంలోనే  పెరిగింది. తల్లి పెద్ద ఫ్యాషన్‌ డిజైనర్‌ కాకపోయినా చక్కటి టైలర్‌. అందమైన డిజైన్స్‌తో దుస్తులు కుట్టేది. దీంతో అనుశ్రీకి ఫ్యాషన్‌పై మక్కువ పెరిగింది. లండన్‌ ఎస్‌ఎస్‌డీటీ యూనివర్సిటీలో చదివి, ఫ్యాషన్‌ డిజైనర్‌గా మారింది. 2015లో ముంబైలో ‘లేబుల్‌ అనుశ్రీ’ పేరుతో సంస్థ స్థాపించింది. ఫారిన్‌ ఫ్యాషన్స్‌ను ఆనుసరించి స్వదేశీ డిజైన్స్‌ చేయడం ఈమె ప్రత్యేకత. ఎక్కువగా సంప్రదాయ చేనేత కళకు ప్రాధాన్యం ఇస్తుంది. కస్టమర్‌ అభిరుచి, బడ్జెట్‌కు తగ్గట్టుగా రూ. వేల నుంచి లక్షల వరకు డిజైన్‌ చేయగలదు. పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌ అన్నిటిలోనూ  అనుశ్రీ కలెక్షన్స్‌ లభిస్తాయి. 

నియతి డిజైన్స్‌..
నియతి అంటే సంస్కృతంలో విధి. పేరుకు తగ్గట్టుగానే స్థాపించిన కొన్ని రోజుల్లోనే ఆ బ్రాండ్‌ రాత మారిపోయింది.. ఆకర్షణీయమైన డిజైన్స్‌ వల్ల.  ఇక్కడ లభించే ప్రతి ఆభరణాన్నీ చేత్తోనే తయారు చేస్తారు. అదీ ప్రత్యేకమైన పాత పద్ధతులను అవలంబించి. అదే నియతి బ్రాండ్‌ వాల్యూ. దీనిద్వారా అంతరించి పోతున్న గిరిజనకళా నైపుణ్యాన్ని కాపాడుతున్నారు. సాధారణంగా ఈ ఆభరణాల కోసం రాగి, వెండి లోహాలను ఉపయోగిస్తారు. అయితే ఈ బ్రాండ్‌ జ్యూయెలరీలో వాడే మెటల్‌ కన్నా వాటి కళాత్మకమైన డిజైన్స్‌కే విలువ ఎక్కువ. కొన్ని ఆభరణాలు రూ. లక్షల్లో కూడా ఉంటాయి. కేవలం నియతి ఒరిజిన్‌ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, వెబ్‌సైట్, స్టోర్స్‌లో మాత్రమే వీటిని కొనుగోలు చేయొచ్చు.  

బ్రాండ్‌ వాల్యూ 
జ్యూయెలరీ బ్రాండ్‌: నియతి
హారం: పరమ కలెక్షన్స్‌ ట్రైబల్‌ నెక్‌పీస్‌
ధర: రూ. 29,000

డ్రెస్‌..
మస్డడ్‌ లెహంగా అండ్‌ ఆర్గంజా నాటెడ్‌ షర్ట్‌
బ్రాండ్‌: లేబుల్‌ అనుశ్రీ 
ధర: రూ. 22,000

కమ్మలు 
అద్వితీయ కలెక్షన్స్‌ ఇయరింగ్స్‌
ధర: రూ. 5,290

ఫలానా బ్రాండ్‌ నుంచి ఇది లాంచ్‌ చేశారు. వెంటనే దానిని కొనాలి, వేసుకోవాలి అని నాకు ఎప్పుడూ ఉండదు. వంద రుపాయల టీషర్ట్‌ అయినా సరే.. నాకు నచ్చితే వేసుకుంటా– రెజీనా

∙దీపిక కొండి

మరిన్ని వార్తలు