బాయ్‌కాట్‌ కంగనా!

26 Aug, 2020 02:24 IST|Sakshi

‘‘వారసులను మాత్రమే సల్మాన్‌ ఖాన్‌ ప్రోత్సహిస్తాడు. తనకు ఎదురు తిరిగినవాళ్లను హింసిస్తాడు. బాయ్‌కాట్‌ సల్మాన్‌ ఖాన్‌’’ అంటూ ఆ మధ్య బాలీవుడ్‌లో పెద్ద దుమారం మొదలైంది. ఇప్పుడు ‘బాయ్‌కాట్‌ కంగనా రనౌత్‌’ అనే వివాదం ఆరంభమైంది. ‘బాయ్‌కాట్‌ కంగనా’ అనే పోస్ట్‌ని లక్షమందికి పైగా సమర్థించారు. గంటకు దాదాపు 13 వేలకు పైగా సోషల్‌ మీడియా ఫాలోయర్స్‌ ఆమెకు వ్యతిరేకంగా పోస్టులను పెట్టారు. డేటా ఇంటిలిజెన్స్‌ యూనిట్‌ ఉదయం పదిగంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు ఉన్న డేటాను తీసుకుని (డి.ఐ.యూ) కంగనాకి వ్యతిరేకంగా వచ్చిన పోస్టులను లెక్కకట్టింది. అసలు కంగనాను ఎందుకు ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు? అంటే దానికి కారణం లేకపోలేదు.

నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యా లేక హత్యా అనే విషయం తేలకముందే బాలీవుడ్‌ మాఫియానే అతన్ని చంపేసిందని, బాలీవుడ్‌లోని నెపోటిజమే (బంధుప్రీతి) బలి తీసుకుందని ఆరోపణలు చేశారు కంగనా. ఈ ఆరోపణలు నిజమే అని నమ్మిన. కొందరు ఫాలోయర్లు కంగనా వ్యతిరేకించినవారిని (స్టార్స్‌ని) సోషల్‌ మీడియాలో అన్‌ఫాలో అయ్యారు. అయితే ఇప్పుడు ‘బాయ్‌కాట్‌ కంగనా’ అనేది వైరల్‌ అయింది. ‘‘ఇదంతా బాలీవుడ్‌ మాఫియా చేస్తున్న పనే. స్టార్‌ కిడ్స్‌ని ప్రోత్సహించడానికి, నా కెరీర్‌ని నాశనం చేయడానికి ఇలా చేస్తున్నారు. అందుకే సోషల్‌ మీడియాలో బాయ్‌కాట్‌ కంగనా అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ట్రెండ్‌ చేస్తున్నారు’’ అన్నారు కంగనా. అది మాత్రమే కాదు.. త్వరలోనే కొందరి వ్యవహారాలను బయటపెడతా అని కూడా పేర్కొన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు