సినీ చరిత్రలోనే సంచలనం.. సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా

30 Jan, 2023 21:43 IST|Sakshi

హన్సిక నటించిన లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్'. ఈ చిత్రాన్ని దర్శకుడు రాజు దుస్సా సింగిల్ షాట్.. సింగిల్ క్యారక్టర్‌తో తెరకెక్కించారు. త్వరలో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్‌గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకంపై బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలి ప్రయత్నంగా సింగిల్ షాట్‌లో సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కించడం సంచలనంగా నిలవనుంది. 

ప్రపంచంలోనే మొదటి సారిగా హన్సిక నటించిన సినిమా 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్'.  ఒక గంటా నలభై అయిదు నిముషాల పాటూ సాగే ఉత్కంఠ పెంచే కథను సింగిల్ షాట్‌లో తెరకెక్కించడం నిజంగా సాహసమే. హాలీవుట్‌లో సింగిల్ షాట్ టెక్నిక్‌తో తెరకెక్కిన బర్డ్ మన్, 1917 చిత్రాల సరసన 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' నిలవనుంది. 

ఆ చిత్రాలు సింగిల్ షాట్‌లో తీసినా చాలా క్యారక్టర్ల చుట్టూ కథ నడుస్తుంది. కానీ 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' ఒకే పాత్రతో రన్ అయ్యే సినిమా. డైలాగులు కూడా చాలా తక్కువగా అవసరమైనంత వరకే పరిమితమైన స్క్రీన్ ప్లేతోనే సినిమా నడుస్తోంది. ఈ వినూత్న ప్రయోగాన్ని భారతదేశంలోనే తొలిసారిగా తెలుగులో చేయడం గొప్ప విషయం. 

సింగిల్ క్యారక్టర్‌తో సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ  చిత్రంలోని పాత్రకు హన్సిక చాలా హెల్ప్ అయ్యారు. చిత్రం అంతా సింగిల్ షాట్‌లో కేవలం తన పాత్ర మీదే నడిచే సినిమా కాబట్టి ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. ఇది హన్సిక కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. సినిమా కూడా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు