One By Two Movie Teaser: ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తా

27 Jul, 2021 13:10 IST|Sakshi

ఆకట్టుకుంటున్న ‘వన్‌ బై టు’ టీజర్‌

డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘వన్ బై టు’.శివ ఏటూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చెర్రీ క్రియేటివ్ వర్క్స్,  బ్యానర్ పై కరణం శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. దారం ప్రభుదాస్ సమర్పకులు. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించే పాత్రలో సాయికుమార్ నటిస్తున్నట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. ఇందులో సాయికుమార్‌ని చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. 

అమ్మాయిలపై యాసిడ్ దాడులు, పసిపిల్లల పై అత్యాచారం వంటి సంఘటనలకి ఇందులో చూపించిన పరిష్కారం చాలా  వైల్డ్ గా ఉంది.  ‘ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తా, నేను ఎంటరైతే విశ్వరూపమే’లాంటి సాలీడ్ డైలాగ్స్ చాలా ఆకట్టుకుంటున్నాయి. మహిళల రక్షణ గురించి రూపొందించిన ఓ పవర్ ఫుల్ మూవీ ‘వన్‌బై టు’అని టీజర్ తో అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ, హిందీలో  కూడా డబ్బింగ్ చేసి థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. త్వరలో చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు