‘పుష్ప’ ఐటం సాంగ్‌ టైటిల్‌తో సినిమా

23 Jun, 2022 16:22 IST|Sakshi

పాటల కోసం కశ్మీర్‌కి వెళ్తున్న ‘ఊ అంటావా మావా ఊఊ  అంటావా మావ’ టీమ్‌

అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ చిత్రంలోని ఐటం సాంగ్‌ ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ పాట పేరుతోనే ఓ సినిమా తెరకెక్కుతుంది. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై తుమ్మల ప్రసన్నకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ అంతా పూర్తయినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. మిగిలిన రెండు పాటల షూట్‌ కోసం కశ్మీర్‌ వెళ్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లో టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ కార్యక్రమం చేపట్టింది.  నిర్మాత మాట్లాడుతూ ‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకం వుంది. బ్యాలెన్స్‌ రెండు పాటలను కాశ్మీర్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తాం. జూలై చివరివారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. అందరూ ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా రేలంగి నరసింహారావు గారు గత సినిమాల రికార్థులను ఈ సినిమా అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. 

దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ..ఇప్పటి వరకు చేసిన కామెడీ సీనిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఇది కామెడీ తో కూడుకున్న హార్రర్ సినిమా. కాశ్మీర్ లో జరిగే పాటల షూట్ తో సినిమా పూర్తి చేసుకొని జులై చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకులు అజయ్ కుమార్, రాజా వన్నెం రెడ్డి, సత్య ప్రకాష్, ఆచంట గోపినాథ్, దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు