నయనతార, విఘ్నేష్‌ శివన్‌ నిర్మాతలుగా మరో కొత్త సినిమా..

18 Oct, 2021 04:31 IST|Sakshi

చెన్నై(తమిళనాడు): నటి నయనతార తన ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థలో నిర్మించిన కూళాంగళ్, రాఖీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. దీనికి ఊర్‌ కురువి అనే టైటిల్‌ నిర్ణయించారు. ఇందులో బిగ్‌బాస్‌ ఫేమ్‌ కవిన్‌ కథానాయకుడిగా నటించనున్నారు. ఈయన హీరోగా నటించిన లిప్టు చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

కాగా ఊర్‌ కురువి చిత్రం ద్వారా అరుణ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర వివరాలను నిర్మాత విఘ్నేష్‌ శివన్‌ విజయదశమి సందర్భంగా మీడియాకు వెల్లడించారు. అరుణ్‌ తన వద్ద తానా సేంద కూట్టం చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశాడన్నారు. అతని ప్రతిభను గుర్తించి దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు