అలాంటి సినిమాలంటే చాలా ఇష్టం

8 May, 2023 01:33 IST|Sakshi
కావ్య థాపర్, సందీప్‌ కిషన్‌

– సందీప్‌ కిషన్‌

‘‘డైరెక్టర్‌ ఆనంద్, నేను మంచి స్నేహితులం. ‘ఊరు పేరు భైరవకోన’ లాంటి సినిమాని ఆయన నాతో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి ఫాంటసీ, అడ్వెంచర్‌ సినిమాలంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం’’ అని హీరో సందీప్‌ కిషన్‌ అన్నారు. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేష్‌ దండా నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ–‘‘నా పుట్టినరోజున(ఆదివారం) ఈ మూవీ టీజర్‌ విడుదల కావడం స్పెషల్‌ మూమెంట్‌. తొలిసారి చండీయాగం చేసి టీజర్‌ రిలీజ్‌ చేయడం చాలా పాజిటివ్‌గా ఉంది. అనిల్‌ సుంకరగారు లేకపోతే ఈ సినిమా ఇక్కడి వరకూ వచ్చేది కాదు’’ అన్నారు. ‘‘టైగర్‌’ సినిమా నుంచి సందీప్, నాకు స్నేహం మొదలైంది.

మరోసారి కలసి సినిమా చేస్తే ఇంకా గ్రాండ్‌గా ఉండాలని ‘ఊరు పేరు భైరవకోన’ చేశాం’’ అన్నారు వీఐ ఆనంద్‌. ‘‘ఈ సినిమా సందీప్‌ కెరీర్‌లో మరచిపోలేని బహుమతి అవుతుందని మాట ఇస్తున్నా’’ అన్నారు అనిల్‌ సుంకర. ‘‘మహాచండీ యాగంతో టీజర్‌లాంచ్‌ చేయడం ఇండస్ట్రీలో ఇదే తొలిసారి. ఈ ఐడియా ఇచ్చిన సందీప్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు రాజేష్‌ దండా. హీరోయిన్‌ కావ్య థాపర్‌ మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: శేఖర్‌ చంద్ర, కెమెరా: రాజ్‌ తోట.

మరిన్ని వార్తలు