నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ లవ్‌ స్టోరీ

28 Sep, 2020 10:43 IST|Sakshi

ఒరేయ్ బుజ్జిగా ట్రైల‌ర్ విడుద‌ల చేసిన  నాగ చైతన్య

అసలు లపాకి అంటే ఎవరు?

సాక్షి, హైదరాబాద్ : కుర్ర హీరో రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. టాలీవుడ్  టాప్ హీరో చైతన్య అక్కినేని దీన్ని లాంచ్ చేశారు. నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ అనే  డైలాగుతో విడుదలైన ఈ  ట్రైలర్ ఈ సినిమా మరిన్ని అంచనాలను పెంచేస్తోంది.  అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, వరుస విజయాలతో జోరుమీదున్న రాజ్‌తరుణ్ ఖాతాలో మరో విజయం ఖాయంగా కనిపిస్తోంది. మాళవిక నాయర్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా, అలనాటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్‌ ప్రత్యేక పాత్రలో  అలరించనున్నారు. ఇంకా నరేష్‌, పోసాని కృష్ణమురళి లాంటి సీనియర్లతోపాటు, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజారవీంద్ర, అజయ్‌ ఘోష్‌, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్‌ లాంటి ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. 

కాగా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’లో అక్టోబర్ 2న విడుదల కానుంది.విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో,  కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనుప్ రుబెన్స్  అందించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు