‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ వచ్చేస్తున్నారు

25 Feb, 2023 14:22 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఫేం సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్‌. మార్చి 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.

ఈ చిత్రంలో  సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషం. సునీల్‌, కృష్ణభగవాన్‌, సన, ప్రవీణ్‌, సప్తగిరి, అజయ్‌ఘోష్‌, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర లాంటి సీనియర్‌ నటులంతా ఇందులో ఉన్నారు. తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. 

మరిన్ని వార్తలు