ఓరి దేవుడా అద్భుతాలు సృష్టిస్తుంది

24 Oct, 2022 04:34 IST|Sakshi
మిథిలా పాల్కర్, వంశీ కాక, విశ్వక్‌ సేన్, ఆశా భట్, అశ్వత్‌

‘‘ఓరి దేవుడా’ చిత్రం అందరి మనసుల్ని టచ్‌ చేస్తుంది. ఎంటర్‌టైనింగ్‌గా రూపొందిన మా సినిమా ప్రేక్షకులే కాదు.. విమర్శకులకు కూడా బాగా నచ్చింది’’ అని హీరో విశ్వక్‌ సేన్‌ అన్నారు. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓరి దేవుడా’. విశ్వక్‌ సేన్, మిథిలా పాల్కర్, ఆశాభట్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో వెంకటేష్‌ కీలక పాత్రలో నటించారు. ప్రసాద్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలైంది.

ఈ సందర్భంగా జరిగిన సక్సెస్‌ సెలబ్రేషన్స్ లో విశ్వక్‌ సేన్  మాట్లాడుతూ–‘‘ఓరి దేవుడా’ టీమ్‌ అంతా మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుంది’’ అన్నారు. ‘‘ఓరి దేవుడా’ ప్లెజెంట్‌ లవ్‌ స్టోరీ.. ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అన్నారు చిత్ర ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వంశీ కాక. ‘‘యువ ప్రేక్షకులే కాదు.. కుటుంబ ప్రేక్షకులు కూడా సినిమాను ఆదరిస్తున్నారు’’ అన్నారు  అశ్వత్‌ మారిముత్తు. హీరోయిన్లు మిథిలా పాల్కర్, ఆశా భట్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ లియోన్, నటుడు వెంకటేష్‌ కాకమాను తదితరులు మాట్లాడారు.

మరిన్ని వార్తలు