ఆస్కార్ బరిలో 'ఆకాశం నీ హద్దురా'

26 Feb, 2021 16:14 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో సూర్య, అపర్ణా బాలమురళి జంటగా నటించిన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) చిత్రానికి అద్భుత ఘనత లభించింది. మహిళ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్ర‌తిష్టాత్మక ఆస్కార్‌ బరిలోకి ఎంటర్‌ అయ్యింది. 93వ ఆస్కార్‌ పోటీల్లో భాగంగా.. ఉత్తమ చిత్రం విభాగంలో పోటీకి సిద్ధమైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ శుక్రవారం ట్విటర్‌లో పేర్కొంది. మొత్తం 366 చిత్రాల‌ను నిర్వాహ‌కులు ఎంపిక చేయ‌గా.. అందులో మ‌న దేశం నుంచి సూరారై పొట్రు మాత్రమే నిలిచింది. దీనికి సంబంధించిన లిస్ట్‌ను ఆస్కార్ అవ‌కాడ‌మీ రిలీజ్ చేసింది. ఈ క్ర‌మంలో మార్చి 5 నుంచి 10 వరకు ఈ మూవీకి ఓటింగ్ జ‌ర‌గ‌నుంది.  తుది జాబితాలోని విజేత చిత్రాలను మార్చి 15న ప్రకటించనున్నారు. అయితే ఆ మ‌ధ్యనే సూరారై పొట్రు ఆస్కార్ అవార్డు బ‌రిలోకి వెళ్లిన విష‌యం తెలిసిందే. జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు/దర్శకురాలు, ఉత్తమ ఒరిజ‌న‌ల్ స్కోర్‌తో కేట‌గిరిల్లో ఈ చిత్రం పోటీలో నిలిచిన విషయం తెలిసిందే.

కాగా తమిళంలో సూరారై పోట్రుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం నీ హద్దురాగా వచ్చిన విషయం తెలిసిందే. కాగా త‌క్కువ ధ‌ర‌కే సామాన్యుడు విమానం ఎక్కేలా చేసిన‌ ఏయిర్‌ డెక్కన్‌ సీఈఓ గోపినాథ్‌ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. కరోనా కాలంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయిన అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ చేశారు. నవంబర్‌ 12న  విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సిఖ్య, 2డీ ఎంట‌ర్‌టైన్ మెంట్ పతాకంపై సూర్య నిర్మించగా.. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించారు. మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. 

ఇదిలా ఉంటే ఆస్కార్‌ నామినేషన్‌కి పంపిన `జల్లికట్టు` చిత్రం నామినేషన్స్ కి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం సూర్య తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. సూర్య 40గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాండిరాజ్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఇటీవల సూర్య కోవిడ్‌ నుంచి కోలుకోగా త్వరలోనే షూటింగ్‌లో జాయిన్‌ కానున్నాడు.

చదవండి:
చెక్‌’ మూవీ రివ్యూ
అదీ ప్రభాస్‌ రేంజ్‌: వంద కోట్ల రెమ్యునరేషన్‌!

మరిన్ని వార్తలు