Oscars 2022: రిజ్‌ అహ్మద్‌.. కిందటి ఏడాది మిస్‌ అయ్యింది.. ఈ ఏడాది ఆస్కార్‌ పట్టేశాడు

28 Mar, 2022 07:18 IST|Sakshi
అనెయిల్‌ కారియా(కుడి), రిజ్‌ అహ్మద్‌(ఎడమ)

Oscars 2022: కిందటి ఏడాది మిస్‌ అయితే ఏంటి.. ఈ ఏడాది ఆస్కార్‌ను పట్టేశాడు రిజ్‌ అహ్మద్‌. పాక్‌-బ్రిటన్‌ సంతతికి చెందిన 39 ఏళ్ల రిజ్‌ అహ్మద్‌ ‘ది లాంగ్‌ గుడ్‌బై’ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌కుగానూ (Best Live Action Short Film) కేటగిరీలో ఆస్కార్‌ అందుకున్నాడు. దర్శకుడు అనెయిల్‌ కారియాతో ఈ అవార్డును స్వీకరించాడు రిజ్‌ అహ్మద్‌.

94వ అకాడమీ అవార్డుల వేడుక ఈ ఉదయం(సోమవారం) అట్టహాసంగా మొదలయ్యింది. ఈ ఈవెంట్‌లో తన తొలి ఆస్కార్‌ను అందుకున్నాడు రిజ్‌ అహ్మద్‌. మల్టీ టాలెంటెడ్‌గా పేరున్న రిజ్‌.. కిందటి ఏడాది ‘సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌’ సినిమాకుగానూ బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యాడు కూడా. కానీ, సీనియర్‌ నటుడు ఆంటోనీ హోప్‌కిన్స్‌కు అవార్డు దక్కింది. 

విశేషం ఏంటంటే.. ది లాంగ్‌ గుడ్‌బైలో అనెయిల్‌ కారియాతో పాటు రిజ్‌ అహ్మద్‌ సహకారం ఉంది. రిజ్‌ కో క్రియేటర్‌. ఇక తన అవార్డు విన్నింగ్‌ స్పీచ్‌లో ఉక్రెయిన్‌ సంక్షోభంపై రిజ్‌ అహ్మద్‌ ప్రసంగించాడు.  ఇది విభజిత కాలం. ఇందులో ‘మనం’, ‘వాళ్లు’ లేరని గుర్తు చేయడమే కథ పాత్ర అని నమ్ముతాం. అక్కడ ‘మనం’ మాత్రమే ఉంది. కానీ, ఇది తమకు చెందినది కాదని భావించే ప్రతి ఒక్కరి కోసం. అలాగే శాంతి కోసం అంటూ ప్రసంగించాడు రిజ్‌ అహ్మద్‌.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు