Oscars Awards 2023: ప్చ్‌.. ఆస్కార్‌ మిస్‌ చేసుకున్న భారతీయ చిత్రం ఇదే!

13 Mar, 2023 08:31 IST|Sakshi

లాస్‌ ఏంజెల్స్‌:  ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో నిలిచిన భారత డాక్యుమెంటరీ చిత్రానికి నిరాశ ఎదురైంది. బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిలిం కేటగిరిలో నామినేట్‌ అయిన ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌​’ (All That Breathes) అస్కార్‌ను దక్కించుకోలేకపోయింది. ఈ విభాగంలో అమెరికాకి చెందిన ‘నావాల్నీ’ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిలింను అవార్డ్‌ వరించింది. ఆల్‌ దట్‌ బ్రీత్స్‌ని షానక్‌ సేన్‌ దర్శకత్వం వహించారు.

ఈ కేటగిరిలో ఇతర నామినీల విషయానికొస్తే.. ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్‌షెడ్, ఫైర్ ఆఫ్ లవ్, ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్ చిత్రాలు ఉన్నాయి. 

 ‘ఆల్ దట్ బ్రీత్’స్ ఈ విభాగంలో నామినేట్ చేసిన రెండవ భారతీయ చిత్రం.  గత సంవత్సరం రింటు థామస్, సుష్మిత్ ఘోష్ రాసిన రైటింగ్ విత్ ఫైర్, ఆస్కార్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైంది. ఆల్ దట్ బ్రీత్స్.. ఢిల్లీలో బర్డ్ క్లినిక్ నడుపుతున్న సౌద్, నదీమ్ అనే ఇద్దరు సోదరుల కథ ఇది. ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ సర్క్యూట్‌లో సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు అనేక అవార్డులను గెలుచుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు.

మరిన్ని వార్తలు