Oscars Awards 2023: మొదలైన ఆస్కార్ సందడి.. ఈ చిత్రానికే తొలి అవార్డ్‌!

13 Mar, 2023 07:04 IST|Sakshi

లాస్ ఏంజెల్స్: ఆస్కార్ 2023 వేడుక అమెరికా లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. సంబరంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న  సినీ ప్రముఖులతో పాటు ఈ ఏడాది నామినేషన్లలో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది హాజరయ్యారు. 

విభాగాల వారీగా అవార్డ్‌ల​కు ప్రధానోత్సవం జరుగుతోంది. ఇక భారత్‌ నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ‘నాటునాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. 

సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా ఆస్కార్‌ (అకాడమీ అవార్డ్స్‌) భావిస్తారు. అందుకే తారలు తమ జీవితంలో ఒక్క సారైన ఈ అవార్డ్‌ను ముద్దాడాలని కోరుతుంటారు. 2023 గాను మొదటి ఆస్కార్‌ ఉత్తమ యానిమేటెడ్‌ సినిమా కేటగిరి దక్కించుకుంది. ఉత్తమ యానిమేటెడ్ సినిమాగా గిల్లెర్మో డెల్ టోరో నిర్మించిన 'పినోచియో' చిత్రం నిలిచింది.

ఈ ఏడాది మొదటి ఆస్కార్‌ను కైవసం చేసుకున్న రికార్డు సొంతం చేసుకుంది. ఇందులో మరో విషయం ఏంటంటే.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్‌ను గెలుచుకుని గిల్లెర్మో డెల్ టోరో ఆస్కార్ చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు.

చదవండి: Natu Natu Song: ‘నాటు నాటు’కు ఆస్కార్‌ వస్తుందా? రాదా? కోట్లలో బెట్టింగ్‌

మరిన్ని వార్తలు