ఆస్కార్‌ వేదికపై నాటు నాటు స్టెప్పులేయనుంది ఎవరో తెలుసా?

12 Mar, 2023 10:19 IST|Sakshi

ఆస్కార్‌ వేడుకల కోసం ప్రపంచమంతా కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తోంది. భారత కాలమానం ప్రకారం మార్చి 13న ఉదయం ఈ వేడుక ప్రారంభం కానుంది. కాగా నాటు నాటు పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌ కోసం పోటీపడుతున్న విషయం తెలిసిందే! ఇందుకోసం అమెరికాలో పాగా వేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రయూనిట్‌ జోరుగా ప్రమోషన్స్‌ నిర్వహించింది. అలుపెరగకుండా ప్రచారాల్లో పాల్గొని ఎలాగైనా ఆస్కార్‌ కొట్టాలన్న కసితో ఉంది. మరోవైపు ఆస్కార్‌ స్టేజీపై రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ నాటు నాటు పాట పాడనున్న విషయం తెలిసిందే! మరి ఈ పాటకు లైవ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ స్టెప్పులేస్తారా? అంటే అది కుదరదని తేలిపోయింది. ప్రాక్టీస్‌ చేసేంత టైమ్‌ దొరకలేనందున లైవ్‌ డ్యాన్స్‌ లేనట్లేనని ఆల్‌రెడీ తారక్‌ క్లారిటీ ఇచ్చాడు.

అలా అని నాటు నాటు పాటకు డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌ లేదనుకుంటే పొరపాటే! నటి లారెన్‌ గొట్లెబ్‌ నాటు నాటు పాటకు స్టెప్పులేయనున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించింది. 'స్పెషల్‌ న్యూస్‌.. ఆస్కార్‌ వేదికపై నాటునాటుకు డ్యాన్స్‌ చేయబోతున్నాను. ప్రపంచంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన వేదికపై పర్ఫామ్‌ చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. దీంతో పలువురు ఆమెకు శుభాకాంక్షలలు తెలుపుతున్నారు. కాగా లారెన్‌ నటి మాత్రమే కాదు, మోడల్‌, కొరియోగ్రాఫర్‌, డ్యాన్సర్‌ కూడా! అమెరికాకు చెందిన ఆమె ఏబీసీడీ: ఎనీ బడీ కెన్‌ డ్యాన్స్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించింది. బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లోనూ గెస్ట్‌గా కనిపించిన ఆమె జలక్‌ దిఖ్‌లాజా సీజన్‌ 6 రన్నరప్‌గా నిలిచింది.

A post shared by Lauren Gottlieb (@laurengottlieb)

మరిన్ని వార్తలు