Oscar Awards 2023: నాటునాటుకు ఆస్కార్‌.. ప్రముఖుల స్పందనలివే..!

13 Mar, 2023 08:53 IST|Sakshi

తెలుగు పాటను విశ్వవ్యాప్తం చేసిన రచయిత చంద్రబోస్‌, సంగీత దర్శకుడు కీరవాణిని భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి అభినందనల వెల్లువతాకింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాను పతాకశీర్షికలకు ఎక్కించిన ఘనులు అని ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటునాటు పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రముఖుల స్పందనలివే..!

ప్రధాని నరేంద్ర మోదీ
తెలుగువారికి అవార్డు రావడం గర్వకారణం, ప్రతిష్టాత్మక అవార్డు తీసుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు, ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ టీమ్‌కు అభినందనలు. ఇది దేశం గర్వించే రోజు.

కేటీఆర్‌
నాటునాటు పాటకు ఆస్కార్‌ రావడం దేశానికి గర్వకారణం. రాజమౌళి దేశాన్ని గర్వపడేలా చేశారు. చరిత్ర సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు అభినందనలు. 

జోగి రమేశ్‌
ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి ఆస్కార్‌ రావడం పట్ల ఏపీ మంత్రి జోగి రమేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమాకు ఆస్కార్‌ రావడం గర్వకారణమన్నారు.

► ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందనలు తెలిపారు. 

► ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అభినందనలు తెలిపారు. 

► ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు.

► ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అభినందనలు తెలిపారు. 

►  ఆస్కార్‌ గెలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌పై మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించారు.

►  ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ సాధించడం.. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగ్గ విషయం అని బాలకృష్ణ ప్రశంసించారు.

►  భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ను పవన్‌ కల్యాణ్‌ అభినందించారు.

మంచు విష్ణు
ఆస్కార్‌ గెలుచుకున్న సంగీత దర్శకుడు కీరవాణికి సినీ హీరో, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు అభినందనలు తెలిపారు. భారతీయ సినిమాకు ఈ విభాగంలో అవార్డు రావడం చరిత్రాత్మకం అని ట్వీట్‌ చేశారు.

చిరంజీవి
తెలుగు సినిమా ఖ్యాతిని ఆర్‌ఆర్‌ఆర్ విశ్వప్యాప్తం చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సినిమా అన్నారు. ఆర్‌ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో తన కుమారుడు రామ్‌చరణ్ భాగమైనందుకు గర్వంగా ఉందన్నారు. ఆర్‌ఆర్ఆర్ దేశానికి గర్వకారణమన్నారు.

రవితేజ
ఆర్‌ఆర్‌ఆర్ చరిత్ర సృష్టించింది, ఈ సినిమా ఆడియన్స్ మదిలో చాలా ఏళ్ల పాటు  నిలిచిపోతుందని రవితేజ్ ట్వీట్ చేశారు. ఆస్కార్‌తో ప్రపంచ శిఖరాగ్రాన నిలిచిందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్ఆర్ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ ఎలక్ట్రిఫయింగ్ డ్యాన్స్ మూవ్స్ లేకపోతే.. నాటు నాటు పాటకు ఆస్కార్ సాధ్యమయ్యేది కాదని రవితేజ అన్నారు.

A post shared by Actor Brahmaji (@brahms25)

మరిన్ని వార్తలు