Oscar Awards: ఆస్కార్‌ కొత్త రూల్స్‌.. ఈ థియేటర్స్‌లో బొమ్మ పడాల్సిందేనట!

21 May, 2022 09:26 IST|Sakshi

95వ ఆస్కార్‌ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చి 12న జరగనుంది. ఈసారి అవార్డులకు సంబంధించిన కొత్త నియమ, నిబంధనలను కమిటీ ప్రకటించింది. ఆ వివరాలు... 

థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలకే ఆస్కారం
ఒక సినిమా ఆస్కార్‌ అవార్డు నామినేషన్‌కు అర్హత సాధించాలంటే కచ్చితంగా థియేటర్స్‌లోనే రిలీజ్‌ కావాలి. ఆ సినిమా 2022 జనవరి 1నుంచి డిసెంబరు 31లోపు థియేటర్స్‌లోనే రిలీజ్‌ కావాలి. యూఎస్‌ మెట్రోపాలిటిన్‌ ఏరియా, లాస్‌ ఏంజిల్స్, ది సిటీ ఆఫ్‌ న్యూయార్క్, చికాగో, మియామీ, అట్లాంటాల్లోని థియేటర్స్‌లో సినిమా కచ్చితంగా ప్రదర్శితమై ఉండాలి. అయితే కరోనా కాలంలో ఓటీటీలో రిలీజైన సినిమాలూ ఆస్కార్‌ అవార్డుకు అర్హత సాధించాయి.

కరోనా టైమ్‌లో అకాడమీ స్క్రీనింగ్‌ రూమ్‌లో సినిమాను ప్రదర్శిస్తే చాలు.. ఆ సినిమా అర్హతను నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు థియేటర్స్‌ రీ ఓపెన్‌ అయిన కారణంగా ఈ వెసులుబాటుని తొలగించారు. ఓటీటీ కోసం సినిమాలు తీసి, ఆస్కార్‌ అవార్డుకు పంపాలనుకునే దర్శక–నిర్మాతలకు ఇది చేదు వార్త అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఆస్కార్‌కు అర్హత సాధించాలంటే సినిమా కచ్చితంగా థియేటర్స్‌లోనే రిలీజ్‌ కావాలనే నిబంధన కరోనాకు ముందు నుంచీ ఉన్న సంగతి తెలిసిందే.

డాక్యుమెంటరీ విభాగంలో వచ్చే అవార్డుల పేర్లు మారాయి. ‘డాక్యుమెంటరీ ఫీచర్‌’ పేరు ‘డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌’గా, ‘డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌’ విభాగం ‘డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌’గా మారింది.
మ్యూజిక్‌ విభాగంలోని ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ అవార్డు విషయంలోనూ అకాడమీ మార్పులు చేసింది. ఈ విభాగంలో ఒక సినిమా నుంచి కేవలం మూడు పాటలనే పోటీకి పంపాలనే నిబంధనను విధించింది కమిటీ.
‘బెస్ట్‌ సౌండింగ్‌’ అవార్డు విభాగానికి అర్హత సాధించాలంటే కచ్చితంగా ఆ సినిమాను సౌండ్‌ బ్రాంచ్‌ మెంబర్స్‌ పర్యవేక్షణలో ప్రదర్శించాలి.

కొన్ని విభాగాలకు సంబంధించి పోటీలో నిలిచేందుకు చివరి తేదీ 
డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్, ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: అక్టోబరు 3, 2022
యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌: అక్టోబరు 14, 2022
లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: అక్టోబరు 14, 2022
ఒరిజినల్‌ స్కోర్, ఒరిజినల్‌ సాంగ్‌: నవంబరు 1, 2022
యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్, జనరల్‌ ఎంట్రీ కేటగిరీ: నవంబరు 15, 2022

చదవండి 👉🏾 అది చూసి అనిల్‌ నాకు వంద హగ్గులు, వంద ముద్దులు అన్నారు
అఖండ నటుడు కన్నుమూత

మరిన్ని వార్తలు