'సిక్స్‌ ప్యాక్‌ బాడీ సీక్రెట్స్‌ చెప్పమని ఆ హీరోలు అడుగుతారు'

15 May, 2021 15:11 IST|Sakshi

సుధీర్‌బాబు నటించిన లేటెస్ట్‌ మూవీ 'శ్రీదేవి సోడా సెంటర్'.  ‘పలాస 1978’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ గ్లింప్స్‌ ఇటీవలె  రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో సుధీర్‌బాబు సూరిబాబుగా నటిస్తున్నారు. ఫస్ట్‌ గ్లింప్స్‌లో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించి మరోసారి ఫిట్‌నెస్‌పై తనకున్న డెడికిషన్‌ను నిరూపించుకున్నారు. ఇక గతంలోనూ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కూడా ఈ విషయంలో సుధీర్‌బాబును అభినందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుధీర్‌బాబు.. తన సిక్స్‌ ప్యాక్‌ గురించి, దాని వెనకున్న సీక్రెట్స్‌ గురించి తెలుసుకోవడానికి కొందరు హీరోలు కాల్‌ చేసి కనుక్కోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారని తెలిపారు. క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి డైట్‌తో శరీరాన్ని మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చని చెప్పారు. 

ఇక ఈ చిత్రాన్ని70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్‌ సినిమాలను అందించిన విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీతో పాటు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందనున్న మరో చిత్రంలోనూ సుధీర్‌బాబు నటిస్తున్నారు. ఉప్పెనలో బేబమ్మగా అలరించిన కృతిశెట్టి సుధీర్‌బాబుకు జంటగా నటించనుంది.

చదవండి : ఇంట్లో ఉంటే ఆకలి, బయటకు వెళితే కరోనా: నటి భావోద్వేగం
శాండల్‌ వుడ్‌ నుంచి వచ్చిన హీరోయిన్లు వీళ్లే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు