OTT And Theatre Releases:  ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే ..!

21 Nov, 2022 17:12 IST|Sakshi

కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా నడుస్తోంది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చిన్న చిత్రాలైనా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. అయితే అదే ఊపులో ఈవారం కూడా మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమైపోయాయి. ఈ వారంలో థియేటర్లతో పాటు ఓటీటీకి వస్తున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దాం. 

అల్లరి నరేష్‌ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'

అల్లరి నరేష్‌, ఆనంది హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈనెల 25న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. 

మనిషి తోడేలుగా మారితే...

వరుణ్‌ ధావన్‌, కృతిసనన్‌ జంటగా తెరకెక్కిన హారర్‌ కామెడీ చిత్రం 'భేదియా'. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించాడు. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేదియా'. తెలుగులో ‘తోడేలు’ పేరుతో అల్లు అరవింద్‌ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అమర్‌ కౌశిక్‌ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు.

తెలుగులో వస్తున్న 'లవ్‌టుడే'

తమిళంలో సూపర్ హిట్ మూవీ 'లవ్‌టుడే'.  అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ప్రదీప్ రంగనాథన్‌  స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో హిట్ టాక్ సాధించింది. నవంబరు 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సత్యరాజ్, రాధిక శరత్‌ కుమార్, యోగిబాబు, రవీనా రవి, ఇవానా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దినేష్‌ పురుషోత్తమన్‌ చాయాగ్రహణం, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. ఆసక్తికరమైన కథ కథనాలతో సాగే ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. 


యాక్షన్‌ సినిమా 'రణస్థలి'

మాటల రచయిత పరుశురాం శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రణస్థలి. ఏజే ప్రొడక్షన్‌ పతాకంపై సురెడ్డి విష్ణు నిర్మిస్తున్నారు. ఇందులో ధర్మ, ప్రశాంత్‌, శివజామి, నాగేంద్ర, విజయ్‌ రాగం తదీతరులు నటిస్తున్నారు. నవంబరు 26న ఈ చిత్రం థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవలే ప్రముఖ డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి చేతుల మీదు రణస్థలి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ కథలో హింస అంశాన్ని స్పృశించిన తీరు ఆలోచన రేకెత్తిస్తుంది. ఈ కథలో రణం ఎవరెవరి మధ్య, ఎందుకు సాగిందన్నది కీలకం’ అని చిత్ర బృందం చెబుతోంది.

ఈ వారం ఓటీటీలో వస్తున్న చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లివే

నెట్‌ఫ్లిక్స్‌

 • వెన్స్‌డే (వెబ్‌సిరీస్‌) నవంబరు 23
 • ద స్విమ్మర్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 23
 •  గ్లాస్‌ ఆనియన్‌ (హాలీవుడ్) నవంబరు 23
 •  బ్లడ్‌, సెక్స్‌ అండ్‌ రాయల్టీ (డ్యాకుమెంటరీ సిరీస్‌) నవంబరు 23
 • ద నోయల్‌ డైరీ (హాలీవుడ్‌) నవంబరు 25
 •  ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌ (హిందీ సిరీస్‌) నవంబరు 25
 •  పడవేట్టు (మలయాళం) నవంబరు 25

అమెజాన్‌ ప్రైమ్‌

 •  గుడ్‌ నైట్‌ ఊపీ (మూవీ) నవంబరు 23
 • జీ5
 •  చుప్‌ (బాలీవుడ్‌) నవంబరు 25

డిస్నీ+హాట్‌స్టార్‌

 •  ప్రిన్స్‌ (తెలుగు) నవంబరు 25
 •  ద గార్డియన్‌ ఆఫ్‌ ది గెలాక్సీ హాలిడే స్పెషల్‌ (హాలీవుడ్‌) నవంబరు 25

ఆహా

 • స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (తెలుగు మూవీ) నవంబరు 25
 • ఎన్‌బీకే అన్‌స్టాపబబుల్‌ (సీజన్‌-2 ఎపిసోడ్‌ 4) నవంబరు 25

సోనీ లివ్‌

 • గర్ల్స్‌ హాస్టల్‌ (హిందీ సిరీస్‌) నవంబరు 25
 • మీట్‌ క్యూట్‌ (తెలుగు మూవీ) నవంబరు 25
మరిన్ని వార్తలు