Avatar 2 OTT Release Date: పలు ఓటీటీలోకి అవతార్‌ 2.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌.. కానీ!

27 Mar, 2023 12:09 IST|Sakshi

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్‌-ది వే ఆఫ్ వాటర్’(అవతార్‌-2).  గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు జేమ్స్‌ కామెరూన్‌. ఇన్నాళ్లు థియేటర్‌ ఆడియన్స్‌ అలరించిన ఈ చిత్రం.. ఇప్పడు ఓటీటీ ప్రేక్షకులను పండోరా గ్రహానికి తీసుకెళ్లేందుకు సిద్దమైంది. ఇదిలా ఉంటే రేపు ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే దీనిపై ‘అవతార్‌’ టీమ్‌ అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంతవరకు చూడని విశేషాలను మూడు గంటలపాటు చూసేందుకు సిద్ధం అవ్వండి’ అంటూ ట్వీట్‌ చేసింది. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ భారీ రేటుకు సొంతం చేసుకుంది. కానీ ఒక్క హాట్‌స్టార్‌లోనే కాకుండా రేపు ఈ మూవీ పలు ఓటీటీల్లో సందడి చేసేందుకు రేడీ అయ్యింది. మూవీఎస్‌ ఎనీ వేర్‌, యాపిల్‌ టీవీ, ప్రైమ్‌ వీడియో, వుడు, ఎక్స్‌ఫినిటీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్‌ మూవీ అండ్‌ టీవీల్లో ‘అవతార్2’ స్ట్రీమింగ్‌ కానుంది. అయితే అవతార్‌ చూడలంటే మత్రం కొన్ని కండిషన్‌ పెట్టారు మేకర్స్‌.

తొలుత ఈ మూవీని అద్దె ప్రాతిపదికన అందుబాటులో తెస్తున్నారు. ఈ సినిమా చూడాలంటే వారు ప్రీ ఆర్డర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్నీ మూవీస్‌ ఇన్‌సైడర్స్‌ వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉంచారు.  ఈ మూవీ అద్దె 19.99 డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1,600. మార్చి 28వ తేదీ ఉదయం 9.30గంటల నుంచి ‘అవతార్2’ చూడొచ్చు. ఒకసారి మూవీని ప్రీఆర్డర్‌ చేసిన తర్వాత 48 గంటల్లోగా క్యాన్సిల్‌ చేసుకోవచ్చు(యూకే, యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో ఉండేవారికి 14 రోజుల వెసులుబాటు).

అయితే సినిమా చూడటం, డౌన్‌లోడ్‌ చేసిన తర్వాత క్యాన్సిల్‌ చేయడం కుదరదు. ‘అవతార్‌2’ 4కె అల్ట్రా హెచ్‌డీ, డాల్బీ అట్‌మాస్‌ ఆడియోతో రానుంది. కాగా ‘అవతార్‌’లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు జేమ్స్‌ కామెరూన్‌. దాదాపు 13 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా ‘అవతార్‌-ది వే ఆఫ్ వాటర్’(అవతార్‌-2)ను తెరకెక్కించాడు. పార్ట్‌ 1లో అడవి అందాను చూపిస్తే.. పార్ట్‌ 2లో సముద్రం లోపల మరో సుందరమైన ప్రపంచం ఉందని తెలియజేశాడు జేమ్స్‌ కామెరూన్‌. 

మరిన్ని వార్తలు