‘ఆహా’లో ‘చావు కబురు చల్లగా’, ఎప్పుడంటే..

20 Apr, 2021 20:58 IST|Sakshi

‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్‌ కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించాడు. ఎన్నో అంచనాల మధ్య మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. ఇక అది అలా ఏంటే.. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ చిత్రం ‘ఆహా’లో ఏప్రిల్‌ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆహా సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది.

ఈ సందర్భంగా దర్శకుడు కౌశిక్ మాట్లాడుతూ 'చావు కబురు చల్లగా'ను ఓ రియలిస్టిక్ పాయింట్‌తో తెరకెక్కించామని, అయితే ఈ సినిమా థియేటర్స్ విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయిందన్నారు. ఓటీటీ కోసం సినిమాను కొద్దిగా ఎడిట్ చేశామని చేప్పాడు. ప్రేక్షకులు చెప్పిన పాయింట్స్‌ను పరిగణలోకి తీసుకుని రీ ఎడిట్ చేశాం. థియేటర్ కంటే బెటర్ కట్ చేశాం. థియేటర్ కంటే ఆహాలో ఇంకా బాగుంటుందని పేర్కోన్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు