Karnapishachi: ఇద్దరు యువకుల కల ‘కర్ణపిశాచి’.. నటీనటులంతా వైజాగ్‌ వాసులే

14 Aug, 2022 10:13 IST|Sakshi

మద్దిలపాలెం (విశాఖ తూర్పు): ఇద్దరు యువకులు కన్న కల...‘కళ’ర్‌ఫుల్‌గా తెరపైకి తెచ్చారు. వెండితెరపై సత్తా చాటుకోవాలని తహతహలాడుతున్నారు. టైటిల్‌తోనే ఆసక్తి రేపుతూ సినిమాపై మంచి అంచనాలు పెంచేశారు. త్వరలో ఓటీటీ ప్లాట్‌ఫారంపై విడుదల కానున్న కర్ణపిశాచి కేరాఫ్‌ ఐటీ ఆఫీస్‌ సినిమా గురించి...ఆ యువకుల గురించి తెలుసుకుందాం. 

ప్రణవి
విశాఖ అమ్మాయి. ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. సినిమాలంటే పిచ్చి. ఇప్పటికే ఎన్నో షార్ట్‌ఫిల్‌్మలు చేసి మెప్పించింది. సీన్‌ చెప్పగానే లీనమైపోవడం ఈమె ప్రత్యేకత. మంచి హావభావాలు, నాట్యం ఈమెకు ప్లస్‌ పాయింట్‌... కర్ణపిశాచిలో మెయిన్‌ లీడ్‌ పోషిస్తోంది. తెరపై ప్రణవి భయపెట్టడం ఖాయం. 

నిఖిల్‌
శ్రీకాకుళం కుర్రోడు... ఏయూలో లా చదువుతున్నాడు. మంచి టైమింగ్‌ ఉన్న మిమిక్రీ ఆరి్టస్ట్‌. సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఒక అద్భుతమైన శక్తిని ఒక మంచివాడు ఎలా ఉపయోగిస్తాడు..చెడ్డవాడు ఎలా దుర్వినియోగం చేస్తాడో చెప్పే ఈ చిత్రంలో హీరోకి దీటుగా అదరగొట్టాడు.   

భరత్‌ కుమార్‌ సిగిరెడ్డి
ఈ యువకుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. సౌతాఫ్రికాలో ఉద్యోగం...కోవిడ్‌ కారణంగా సొంతూరు అనకాపల్లి వచ్చేశాడు. వర్క్‌ ఫ్రం హోం. సొంతూరు..చిన్ననాటి కలలు నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం దొరికింది. భరత్‌కుమార్‌ చిన్నప్పటి నుంచి కథలు రాయడం ఇష్టం..ఆ రాసే కథలో తనను తాను ఊహించుకునేవాడు..అలా పలు షార్ట్‌ఫిల్మ్‌లకు కథలు రాయడం..అవకాశం ఉన్నప్పుడల్లా నటించడం చేసేవాడు. ఉద్యోగరీత్యా సౌతాఫ్రికా వెళ్లిపోవడంతో తాత్కాలికంగా తన కళకు బ్రేక్‌ పడింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా హీరోగా...నిర్మాతగా మారి కర్ణపిశాచి అనే చిత్రానికి నాంది పలికాడు. ప్రస్తుతం సినిమా సెన్సార్‌కు వెళ్లింది. త్వరలోనే ఓటీటీ వేదికగా విడుదల కానుంది.

చదవండి: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న షారుక్‌ ఖాన్‌ కుమారుడు 

నమావతి
పేరే వెరైటీ. ఆమె నటన మరింత మెప్పిస్తుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. అందం..అభినయం కలగలిపిన వర్ధమాన నటి నమావతి. కర్ణపిశాచిలో మూడో హీరోయిన్‌గా నటిస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నానని, తెరపై తన నటన చూసి విజల్స్‌ గ్యారంటీ అని చెబుతోంది. 

విజయ్‌ మల్లాది
షార్ట్‌ ఫిల్మ్‌లతో  కెరీర్‌ మొదలు పెట్టాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రికి  బంధువు. విశాఖ వేదికగా చాలా షార్ట్‌ ఫిల్మ్స్‌ తీసి గుర్తింపు పొందాడు. మంచి ప్రతిభ ఉన్న కుర్రోడు. విజయ్‌ టాలెంట్‌ను గుర్తించి భరత్‌ కుమార్‌ రాసుకున్న కర్ణపిశాచిని అతని చేతిలో పెట్టాడు. సినిమాలో నటించిన వారంతా విశాఖ కళాకారులే. సినిమా మొత్తం మన ఉత్తరాంధ్రలోనే షూటింగ్‌ జరుపుకుంది.  స్క్రీన్‌ ప్లే, దర్శకత్వ ప్రతిభతో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు.   

మరిన్ని వార్తలు