హీరోయిన్‌ను రక్షించిన విలన్, సినిమాలో కాదు‌

10 Apr, 2021 08:54 IST|Sakshi
ఓట్టం వర్కింగ్‌ స్టిల్‌ 

చెన్నై: హీరోయిన్‌ను కాపాడిన విలన్‌ చిత్ర యూనిట్‌ అభినందనలు పొందారు. ఆ సంగతేంటో చూద్దాం. లింక్‌  క్రియేషన్స్‌ పతాకంపై హేమవతి ఆర్‌ నిర్మిస్తున్న చిత్రం ఓట్టం. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా దివంగత ప్రముఖ దర్శకుడు రామనారాయణన్‌ శిష్యుడు ఎన్‌.మురుగన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అదేవిధంగా ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడు ప్రదీప్‌ వర్మ కథానాయకుడిగా అవుతున్నారు. ఆయనకు జంటగా బెంగళూరుకు చెందిన మోడల్‌ ఐశ్వర్య సిందోషి నటిస్తుండగా, మరో నాయికగా కేరళకు చెందిన అనుశ్రేయ నటిస్తున్నారు. రవిశంకర్‌ అనే నటుడు విలన్‌గా పరిచయం అవుతున్నారు. అయితే ఆయన ఆ చిత్ర హీరోయిన్‌ మాత్రం నిజజీవితంలో హీరోగా మారారు.

ఆమెను రియల్‌ లైఫ్‌లో పలు ఆపదల నుంచి రక్షించారు. ముఖ్యంగా చిత్ర కథానాయకి ఐశ్వర్య సిందోషి చిత్రంలోని పాటల సన్నివేశాలకు డ్రెస్‌ కొనుగోలు చేయడానికి బెంగళూరులోని ఒక పెద్ద షాపింగ్‌ మాల్‌కు వెళ్లారు. ఆమెతో పాటు నటుడు రవిశంకర్‌ కూడా వెళ్లారు. అయితే అక్కడ కొందరు పోకిరోళ్లు నటి ఐశ్వర్య సిందోషిను ఎగతాళి చేస్తూ వేధింపులకు గురి చేశారు. దీంతో ఆమె వెంట ఉన్న రవిశంకర్‌ వారిని అడ్డుకొని చెంప చెళ్లుమనిపించి ఇక్కడ నుంచి వెళ్లకపోతే పోలీసులకు పట్టిస్తానని హెచ్చరించడంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో హీరోయిన్‌ కాపాడిన విలన్‌ జయశంకర్‌ చిత్రం యూనిట్‌ అభినందించారు.
చదవండి: 'శ్రీదేవి.. బ్యూటీ ఐకాన్'

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు