‘పాపే మా జీవనజ్యోతి’ అంటోంది స్టార్ మా

24 Apr, 2021 14:31 IST|Sakshi

స్టార్ మా సరికొత్త భావోద్వేగాలతో కూడిన ఓ కొత్త కథ తో సరికొత్త ధారావాహిక రూపొందించింది. ఈ సారి అమ్మ అనే ఎమోషన్ తో వినూత్నమైన కథను అందిస్తోంది. ఆ సీరియల్ పేరు "పాపే మా జీవనజ్యోతి". టైటిల్ లో జీవన పాప అయితే, జ్యోతి తల్లి. 

ఆనందంగా సంతోషంగా వున్న ఓ పెద్ద కుటుంబం.. అందులో అందరికీ ముద్దుల మురిపాలు పంచే ఓ పాప. కొన్ని సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఆడపిల్ల లేని లోటు తీర్చిన పాప ఆ అమ్మాయి. దానితో ఇంట్లో అందరూ కంటికి రెప్పలా చూసుకుంటూ వుంటారు ఆ పాపని. కానీ ఇంతలోనే ఊహించని సంఘటన. కొన్ని కారణాల వాళ్ళ ఆ పాప ఇంటి నుంచి మిస్ అయింది. ఎవరో ఎత్తుకుపోయారు. ఏ తల్లి సహించలేనిది. ఏ కుటుంబం భరించలేనిది. ఇంతకీ ఎవరి పని ఇది? తరవాత పరిస్థితులు ఎలా మారాయి? పాప ఏమైంది? ఎవరి చేతుల్లో వుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. అన్నిటికీ జవాబులిస్తుంది "పాపే మా జీవనజ్యోతి" సీరియల్.

పల్లవి, ప్రీతమ్, ప్రీతీ నిగమ్ తదితరులు నటిస్తున్న ఈ ధారావాహికని శాండల్ వుడ్ మీడియా నిర్మిస్తోంది. మాధవ్ దర్శకులు. ఏప్రిల్ 26 నుంచి  సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మా లో ఈ ధారావాహికి ప్రసారం అవుతుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు