Mangalavaram Movie Update: నవంబర్‌లో థ్రిల్‌ చేయనున్న మంగళవారం

27 Sep, 2023 00:47 IST|Sakshi

΄పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ .ఎం నిర్మించారు. ఈ చిత్రాన్ని నవంబర్‌ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అజయ్‌ భూపతి మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన రస్టిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మంగళవారం’’ అన్నారు. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో ట్రైలర్‌ విడుదల చేస్తాం’’ అన్నారు స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ .ఎం. ఈ చిత్రానికి సంగీతం: బి. అజనీష్‌ లోక్‌నాథ్, కెమెరా: దాశరథి శివేంద్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సాయికుమార్‌ యాదవిల్లి.

మరిన్ని వార్తలు