పీక కోస్తా అని నా భార్య వార్నింగ్‌ ఇచ్చింది : నాగబాబు

15 Apr, 2021 15:57 IST|Sakshi

సినిమాల్లో నటించకున్నా.. టీవీల్లో కనిపించకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంటాడు మెగా బ్రదర్‌ నాగబాబు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన పలు సినిమాల్లో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఆతర్వాత బుల్లితెరపై కూడా సందడి చేశాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో ఉండే నాగబాబు.. అభిమానులు అడిగిన చిలిపి ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానాలు ఇస్తుంటాడు. ఇటీవల ఇన్‌స్ట్రాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లోకి వచ్చిన నాగబాబు.. రెండో పెళ్లి గురించి తన అభిప్రాయం చెప్పాడు.

మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా సర్‌? అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా, ‘ఈ వయసులో నాకు పెళ్లా..? అయినా మీరంతా ఓకే అంటే నాకూ ఓకే’ అంటూ నాగబాబు సరదాగా బదులిచ్చిన విషయం తెలిసిందే. నాగబాబు సమాధానంపై కొంతమంది ట్రోల్‌ చేయగా, మరికొంత మంది తనలోని హాస్యచతురతను మెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి రెండో పెళ్లి విషయంపై నాగబాబు మాట్లాడాడు. ఇటీవల జరిపిన ఇన్‌స్ట్రాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో  ‘మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు సార్’ అని అడగ్గా.. ‘మా ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు.. ఆ ఆలోచన వచ్చినా పీక కోస్తా అని ప్రేమగా చెప్పింది.. అంత ప్రేమగా చెప్పాక నేను మాత్రం రెండో పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తాను’ అంటూ తనదైన శైలీలో సమాధానం ఇచ్చాడు. నాగబాబు ఫన్నీ రిప్లై ఇప్పుడు సోషల్‌ మీడిమాలో వైరల్‌ అయింది.


చదవండి: 
నాగబాబు వాట్సాప్‌ డీపీ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే!
సాయి పల్లవితో వరుణ్‌ పెళ్లి.. బ్రహ్మానందాన్ని వాడేసిన నాగబాబు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు