ఆ కల నెరవేరిందన్న పాగల్‌ హీరో విశ్వక్‌ సేన్‌

20 Aug, 2021 15:00 IST|Sakshi

సాక్షి,విశాఖపట్నం: తాను నటించిన చిత్రం జగదాంబ థియేటర్‌లో చూడాలని కలలుకన్నానని, అది నేటికి నెరవేరిందని పాగల్‌ సినిమా హీరో విశ్వక్‌ సేన్‌ ఆనందం వ్యక్తం చేశారు. పాగల్‌ చిత్రం యూనిట్‌ గురువారం మధ్యాహ్నం జగదాంబ థియేటర్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు కుప్పిలి సురేష్, నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ పాగల్‌ సినిమా విజయవంతంగా నడుస్తోందన్నారు. సినిమా షూటింగ్‌ చాలా వరకూ విశాఖలోనే జరిగిందన్నారు. కోవిడ్‌ సమయంలో 50 శాతం సీట్లతో నడుస్తున్న థియేటర్లలో సైతం పాగల్‌ హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోదన్నారు.

ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌కూడా సాధించింనదన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. చిత్రం విజయయాత్రను తిరుపతి, విజయవాడ పూర్తి చేసుకుని విశాఖ చేరుకున్నామన్నారు. సమావేశంలో వెంకటేశ్వర ఫిలింస్‌ ప్రతినిధులు, చిత్రం యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు చిత్ర యూనిట్‌ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్‌సేన్‌తో అభిమానులు సెల్ఫీలు తీసుకున్నారు. 

చదవండి:వైష్ణవ్‌ తేజ్‌-క్రిష్‌ మూవీ టైటిల్‌ ఇదే, ఫస్ట్‌లుక్‌ విడుదల

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు