నా ఫొటోలు వాడితే బాగోదు: న‌టి వార్నింగ్‌

23 Sep, 2020 20:59 IST|Sakshi

స‌హ‌నం సెల‌బ్రిటీల‌కూ ఉంటుంది. కానీ హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తిస్తే వారు స‌హ‌నాన్ని కోల్పోక త‌ప్ప‌దు. అందుకు కార‌ణ‌మైన వారిపై ఆగ్ర‌హానికి గుర‌వ‌కా త‌ప్ప‌దు. హిందీ పాపుల‌ర్ సీరియ‌ల్‌' తార‌క్ మెహ‌తా కా ఉల్టా ఛ‌ష్మా' సీరియ‌ల్ న‌టి పాల‌క్ సిధ్వాణీ త‌నంటే గిట్ట‌నివారికి గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. త‌న ఫొటోలే వాడుతూ త‌న‌పైనే దాడికి దిగ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది. మీమ్స్‌లో త‌న ఫొటోలు వాడితే అస్స‌లు బాగోద‌ని చెప్పింది. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అంద‌రికీ ఓ స్ట్రాంగ్‌ వార్నింగ్ మెసేజ్ వ‌దిలింది. "విష‌పూరిత‌మైన ఫాల్తూ మెసేజ్‌లు వ్యాప్తి చేసే మీమ్ పేజెస్‌.. మీ అంద‌రికీ ఇదే నా మొద‌టి, ఆఖ‌రి హెచ్చ‌రిక‌. నా ఫొటోలు వాడుకోవ‌డం మానేయండి, వాటిని ఎడిట్ చేయ‌డం కూడా ఆపేయండి."  (చ‌ద‌వండి: నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు)

"నా గురించి చెత్త వాగ‌డానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఇప్ప‌టికే ఈ లోకంలో ఎంతో ద్వేషం నిండి ఉంది. మీరు ఇంకా దాన్ని పెంచాల‌ని చూడ‌కండి. నేను న‌చ్చ‌క‌పోతే, నన్ను ఫాలో అవ‌కండి. సింపుల్‌! అంతే కానీ న‌న్ను ఛీ కొడుతూ నా గురించి వ్య‌తిరేకంగా రాసే హ‌క్కు మీకు లేదు. అయినా స‌రే, చెవికెక్కించుకోకుండా నా గౌర‌వం, మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను దెబ్బ‌తీసేలా ‌ఏదైనా పోస్టు పెట్టార‌నుకో.. త‌ర్వాత ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయి. కాబ‌ట్టి మీపై క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకునే దాకా న‌న్ను లాగ‌కండి. అంద‌రికీ చెప్తున్నా.. ఇక్క‌డితో ఆపేయండి" అంటూ గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చారు. వీలైతే ప్రేమ‌ను పంచండి.. ద్వేషాన్ని కాదు అంటూ పాల‌క్ హిత‌బోధ చేశారు. (చ‌ద‌వండి: సుశాంత్‌ డ్రగ్స్‌ కోసం మమ్మల్ని వాడుకున్నాడు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా