అమెరికాలో భారీ స్థాయిలో విడుదల కానున్న బిల్లా 4k వెర్షన్

22 Oct, 2022 10:13 IST|Sakshi

ఈమధ్య కాలంలో సినిమాలను రీ మాస్టర్‌ చేసి మరోసారి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘బిల్లా’ సినిమా 4K లేటెస్ట్ వెర్షన్‌ ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా అమెరికాలోనూ రికార్డు స్థాయిలో విడుదల కాబోతుంది. యూఎస్‌లో  70కి పైగా లొకేషన్స్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రీ రిలీజ్ మూవీస్‌లో ఇది అత్యధిక థియేటర్స్ లిస్ట్ అని చెప్పొచ్చు. ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టు రీ రిలీజవుతున్న ఈ సినిమాక కోసం అభిమానులు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు.

కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాలో దివంగత రెబల్ స్టార్ కృష్ఱంరాజు కీలక పాత్రలో నటించారు.అనుష్క, నమిత, హన్సిక కథానాయికలుగా నటించారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు.

మరిన్ని వార్తలు