డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'పరారీ' మూవీ

25 Nov, 2023 17:13 IST|Sakshi

దర్శకుడు రాజుమురుగన్‌ శిష్యుడు ఎళిల్‌ పెరియవెడి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'పరారీ'. ఎస్పీ సినిమాస్‌ సంస్థతో కలిసి దర్శకుడు రాజుమురుగన్‌ నిర్మిస్తున్నారు. 'తోళర్ వెంకటేశన్‌' ఫేమ్‌ హరిశంకర్‌ హీరోగా నటిస్తున్నారు. సంగీత కల్యాణ్‌ అనే అమ్మాయి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని దర్శకుడు లోకేష్‌ రిలీజ్ చేశారు. 

(ఇదీ చదవండి: భర్తని పరిచయం చేసిన హీరోయిన్ ఇలియానా.. ఇతడెవరో తెలుసా?)

తిరువణ్ణామలై చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లి జీవించే ప్రజలు జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రం ఇది అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఆ ప్రాంతలో ఉండే కుల, మత రాజకీయాల గురించి ఇందులో చూపించనున్నట్లు చెప్పాడు. చాలామంది కొత్త వాళ్లు ఇందులో నటించారని తెలిపాడు. ప్రస్తుతం నిర్మాణాంతరం కార్యక్రమాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మూవీకి షాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

(ఇదీ చదవండి: పాతాళానికి పడిపోయిన శివాజీ గ్రాఫ్‌! మాట కోసం చస్తావా? పెద్ద జోక్‌..)

మరిన్ని వార్తలు