‘పరిగెత్తు పరిగెత్తు’బిగ్‌ బ్రేక్‌ ఇస్తుందని ఆశిస్తున్నా: సూర్య శ్రీనివాస్‌

29 Jul, 2021 17:06 IST|Sakshi

'పరిగెత్తు పరిగెత్తు' చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. నటుడిగా నాకు పర్మార్మెన్స్ కు బాగా స్కోప్ దొరికింది.  ఈ సినిమా హీరోగా నాకు బిగ్‌ బ్రేక్‌ ఇస్తుందని ఆశిస్తున్నాను’అన్నారు యంగ్‌ హీరో సూర్య శ్రీనివాస్‌. ఓటీటీ ,సిల్వర్ స్క్రీన్ మీద మంచి పాత్రలు చేసి తన ప్రతిభ చూపిన సూర్య శ్రీనివాస్,  'పరిగెత్తు పరిగెత్తు' సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీ జూలై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సూర్యశ్రీనివాస్‌ మాట్లాడుతూ..  'పరిగెత్తు పరిగెత్తు'  తప్పక విజయం సాధిస్తుందన్నారు. ప్రస్తుతం కమిట్ మెంట్, టాక్సీ 911, చిల్ బ్రో, జమానా సినిమాల్లో నటిస్తున్నానని, ఈ సినిమాలు కూడా వీలైనంత త్వరగా రిలీజ్ కాబోతున్నాయని తెలిపాడు. 

మరిన్ని వార్తలు