కిడ్నాప్‌ చేయడం ఓ కళ 

21 Nov, 2023 01:25 IST|Sakshi
శ్రద్ధా దాస్

చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్‌ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘పారిజాత పర్వం’. కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌ అనేది ట్యాగ్‌ లైన్‌ (కిడ్నాప్‌ చేయడం అనేది ఓ కళ). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్‌ రెడ్డి, దేవేష్‌ నిర్మిస్తున్న ఈ క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ విడుదలయ్యాయి.

ఒక పోస్టర్‌లో చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, శ్రీకాంత్‌ అయ్యంగార్లు చేతిలో గన్‌తో, ఇతర పాత్రలు ఆశ్చర్యంగా చూస్తున్నట్లు కనిపించారు. ఇంకో పోస్టర్‌లో శ్రద్ధా దాస్‌ చేతిలో గన్‌తో స్టయిలిష్‌గా కనిపించారు. 

మరిన్ని వార్తలు