మూడు పువ్వులు... ఆరు కాయలు

11 Dec, 2020 00:25 IST|Sakshi

బాలీవుడ్‌ నటి పరిణీతీ చోప్రా హీరోయిన్‌గా ప్రవేశించి ఈ నెల 9తో తొమ్మిదేళ్లయింది. ‘లేడీ వర్సెస్‌ రిక్కీ బాల్‌’ చిత్రంతో సిల్వర్‌ స్క్రీన్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొందారు. రెండో సినిమా ‘ఇష్క్‌ జాదే’లో ‘మే పరేషాన్‌ పరేషాన్‌’ అని హీరో అర్జున్‌ కపూర్‌ తో ఆడి పాడి కుర్రకారుని పరేషాన్‌ చేశారు. పరిణీతి తొలి సినిమా ఎంట్రీనే యశ్‌ రాజ్‌ ఫిలింస్‌  వంటి పెద్ద నిర్మాణ సంస్థతో జరిగింది.

ఒకేసారి మూడు చిత్రాలు చేసే విధంగా పరిణీతీతో ఒప్పందం కుదుర్చుకుంది యశ్‌ రాజ్‌ సంస్థ. ఆమె కెరీర్‌ కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. నిజానికి యశ్‌ రాజ్‌ సంస్థలో పీఆర్‌ (పబ్లిక్‌ రిలేషన్‌) గా చేరారు పరిణీతి. ఎక్కువ మేకప్‌ వేసుకోవాల్సి వస్తుందని నటనను ఇష్టపడలేదు. అయితే కజిన్‌ ప్రియాంకా చోప్రాను ఆదర్శంగా తీసుకుని నటి అయ్యారు. ఈ తొమ్మిదేళ్లలో ఆమె ‘ఇష్క్‌ జాదే, ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’, ‘మేరీ ప్యారీ బిందు’, ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’, ‘నమస్తే ఇంగ్లాండ్‌’, ‘కేసరి’ తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు