ఆ సీన్‌ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు : హీరోయిన్‌

10 Jun, 2021 15:14 IST|Sakshi

Parineeti Chopra: సినిమా న‌టులు అంటేనే పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా ఒదిగిపోవాలి. ఏ క్యారెక్ట‌ర్ చేసినా శ‌క్తి వంచ‌న లేకుండా ఫ‌ర్ఫామెన్స్ చూపించాలి. అప్పుడే తమ పాత్రలకు న్యాయం చేయగలుగుతారు. నేటితరం హీరో, హీరోయిన్లకు ఈ విషయం బాగా అర్థమైంది. అందుకే పాత్రలకు తగ్గట్లుగా తమ శరీరాన్ని, మైండ్‌సెట్‌ని మార్చుకుంటున్నారు.  లావు పెరగాలని, తగ్గాలని నెలల పాటు  డైటింగ్‌ చేస్తున్నారు. నల్లగా కనిపించడానికి రోజుల తరబడి ఎండలో నిలబడినవాళ్లు కూడా ఉన్నారు. అలాగే బాలీవుడ్‌  స్టార్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా కూడా ఓ పాత్ర కోసం రెండు రోజుల పాటు స్నానం చేయకుండా ఉన్నారట. 

పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్ నటించిన సందీప్ ఔర్ పింకీ ప‌రార్ సినిమా ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఇందులో పరిణీతి నటనకు ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. కాగా, ఇందులో ఓ సీన్ కోసం తాను రెండు రోజులు స్నానం చేయ‌లేద‌ని పరిణీతి చెప్పింది. 

సినిమాలోని కథ ప్రకారం తన పాత్రకి అనుకోకుండా అబార్షన్ జరగటం.. కొన్ని రోజులు అదే షాక్ లో ఉండే సీన్లను అత్యంత సహజంగా తెరకెక్కించటం కోసం తానీ పని చేసినట్లు చెప్పారు. ఒక మారుమూల కొండ ప్రాంతంలోని గుడిసెలో ఈ సీన్లు మూడు రోజులు షూట్ చేశారని చెప్పారు. ఆ ప్రాంతం మొత్తం మరికిగా ఉండేదని.. షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లినా..స్నానం చేయకుండా నేరుగా షూటింగ్ కు వచ్చానని.. సీన్ బాగా రావాలన్న ఉద్దేశంతో ఇలా చేశానని పరిణీతి చెప్పుకొచ్చింది. 


చదవండి:
కిస్‌ సీన్‌.. కట్‌ అంటే కట్‌ అంతే: హీరోయిన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు