హీరోయిన్‌ కాకముందు అనుష్క దగ్గర పనిచేశా: పరిణీతి చోప్రా

11 Jun, 2021 10:01 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా టర్కీలో ప్రకృతిని ఆస్వాదిస్తోంది. తాజాగా ఆమె సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన జర్నీ, సినిమాల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మతో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టింది.

అనుష్క శర్మ తన లేడీ క్రష్‌ అన్న పరిణీతి 'బ్యాండ్‌ బాజా బారత్‌' సినిమా ఇంటర్వ్యూల కోసం అనుష్క డేట్స్‌ తానే చూసుకున్నానని తెలిపింది. ఆ సమయంలో అనుష్కకు పీఆర్‌గా పని చేసిన తాను కేవలం మూడు నెలల్లో ఆమెతో కలిసి నటించే స్థాయికి ఎదిగాను అని చెప్పుకొచ్చింది. అలా 'లేడీస్‌ వర్సెస్‌ రికీ బహల్‌'లో తనతో పాటు స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నానని వెల్లడించింది. దీనిపై స్పందించిన అనుష్క బిగ్‌ హగ్‌ అంటూ బదులిచ్చింది.

ఇక 2021 తనకు ఎంతో స్పెషల్‌ అంటోంది పరిణీతి. నెల రోజుల వ్యవధిలోనే రిలీజైన మూడు సినిమాలు(సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌, సైనా, ద గర్ల్‌ ఆణ్‌ ద ట్రైన్‌) విమర్శకుల ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపింది. మున్ముందు కూడా మంచి పాత్రలే చేయాలనుకుంటున్నానని చెప్పింది. ప్రస్తుతం ఆమె రణ్‌బీర్‌ కపూర్‌ 'యానిమల్‌' సినిమాలో నటిస్తోంది.

చదవండి: ఆ సీన్‌ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు : హీరోయిన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు