బ్యాడ్మింటన్‌కు టెన్నిస్‌కు తేడా తెలీదా?

3 Mar, 2021 14:09 IST|Sakshi

బయోపిక్‌లకు అన్ని ఇండస్ట్రీలలో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంటుంది. ఈ మధ్యకాలంలో వీటి సంఖ్య అధికంగా పెరిగింది. ముఖ్యంగా అందులో టైటిల్‌ రోల్‌ చేసే ఆర్టిస్ట్‌ మీద అందరి దృష్టి ఉంటుంది. లుక్‌ సరిగ్గా సెట్‌ అయిందా? అని చూస్తుంటారు. అలాగే జీవితకథలో లేనివి కల్పించారా? లేదా ఏదైనా పొరపాటు చేశారా? అని భూతద్దంలో వెతుకుతారు. తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా తీస్తున్న ‘సైనా’ పోస్టర్‌లో కొందరు ఓ తప్పుని పట్టుకున్నారు. సైనా పాత్రలో పరిణీతీ చోప్రా నటిస్తుండగా అమోల్‌ గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించి, పోస్టర్‌ని విడుదల చేశారు.

సర్వీస్‌కి సిద్ధమవుతున్న చెయ్యితో పోస్టర్‌ని విడుదల చేశారు. అయితే బ్యాడ్మింటన్‌ సర్వీస్‌ ఈ పద్ధతిలో ఉండదని, ఇది టెన్నిస్‌ సర్వ్‌లా ఉందని, ఇంత పెద్ద తప్పుని సినిమా యూనిట్‌ ఎందుకు పట్టుకోలేకపోయిందని ఓ నెటిజన్‌ విమర్శించగా, పోస్టర్‌లో చెయ్యి కనబడిన విధానం ‘టెన్నిస్‌ సర్వ్‌’లానే ఉందని మరికొందరు నెటిజన్లు విమర్శించారు. కొందరు నెటిజన్లు మాత్రం పోస్టర్‌ చాలా బాగుందని ప్రశంసించారు. ఇలా పోస్టర్‌ విడుదలైన రోజునే మిశ్రమ స్పందన లభించడం చిత్రబృందానికి షాకింగ్‌గానే ఉంటుందని చెప్పొచ్చు. 

చదవండి: అవకాశం వస్తే.. ఆ అధ్యాయాన్ని చెరిపేస్తా : నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు