Parineeti Chopra Wedding Dress Special: పరిణీతి చోప్రా వివాహం.. లెహంగా కోసమే అన్ని రోజులా?

25 Sep, 2023 15:33 IST|Sakshi

బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పరిణయమాడింది. ఈ వివాహానికి సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు.  వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ జంట వెడ్డింగ్ దుస్తుల్లో దిగిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ఇవీ అభిమానులు సైతం నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

(ఇది చదవండి: నాకెలాంటి సంబంధం లేదు.. పైశాచిక ఆనందం కోసమే: టాలీవుడ్ హీరోయిన్)

పరిణీతి లెహంగాపై చర్చ

ఇదిలా ఉంటే పెళ్లిలో పరిణీతి చోప్రా ధరించిన డ్రెస్‌పైనే నెట్టింట చర్చ మొదలైంది. వధువుగా హీరోయిన్‌ ధరించిన లెహంగా డిజైన్‌ ప్రత్యేకంగా కనిపించడంతో అందరి దృష్టి దానిమీదే పడింది. అయితే వీరి పెళ్లికి దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా సిద్ధం చేశారు. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్రెస్సుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పరిణీతి ధరించిన లెహంగా ప్రత్యేకతలను ఆయన వివరించారు. 

పరిణీతి కోసం లెహంగా రూపొందించడానికి దాదాపు 2,500 గంటల సమయం పట్టిందని మనీష్ మల్హోత్రా తెలిపారు. ఇది పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చేసినట్లు వెల్లడించారు. ఈ అందమైన  లెహంగాను పాతకాలపు బంగారు దారంతో రూపొందించామన్నారు. అతిథులను మంత్రముగ్దులను సున్నితమైన మెష్, దుపట్టా, ముత్యాలు, ప్రతి ఒక్కటి ఫెయిర్‌తో అలంకరించామని డిజైనర్ మనీశ్ పేర్కొన్నారు. అంతే కాకుండా  పరిణీతి డ్రెస్‌పై రాఘవ్ పేరు ముద్రించినట్లు తెలుస్తోంది. 

A post shared by @parineetichopra

మరిన్ని వార్తలు