Paruchuri Gopala Krishna: ఆర్‌ఆర్‌ఆర్‌లో కష్టమైన పాత్ర రామ్‌చరణ్‌దే..

7 Aug, 2022 11:30 IST|Sakshi

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో చెర్రీ, తారక్‌ ఇద్దరూ పోటాపోటీగా నటించారు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.

'కొమురం భీముడిగా నటించిన తారక్‌ పాత్ర నిడివి సీతారామరాజుగా నటించిన చరణ్‌ పాత్ర కంటే తక్కువని చాలామంది అన్నారు. కానీ పాత్ర నిడివి ఎప్పుడూ లెక్క చేయకూడదు. ఉదాహరణకు పెదరాయుడులో రజనీకాంత్‌ పాత్ర నిడివి కొన్ని నిమిషాలు మాత్రమే. కానీ ఇప్పటికీ ఆ సినిమా వస్తుందంటే రజనీకాంత్‌గారే గుర్తొస్తారు. కాబట్టి పాత్ర నిడివి ఎన్ని నిమిషాలు ఉందని చూడొద్దు.

సూటిగా చెప్పాలంటే భీమ్‌ కంటే రామ్‌ పాత్ర నిడివి కాస్త ఎక్కువే! కానీ రచయిత, దర్శకుడు రెండు పాత్రలను రెండు కళ్లలాగే చూశారన్నది నా ఉద్దేశం. భీమ్‌ ఓ ముస్లిం పేరుతో అండర్‌ కవర్‌లో ఉన్నాడు. రామ్‌చరణ్‌ అండర్‌ కవర్‌లో ఉన్నాడనేది ఫ్లాష్‌బ్యాక్‌ చూపించేవరకు తెలియలేదు. అంటే అతి కష్టతరమైన పర్ఫామెన్స్‌ రామ్‌చరణ్‌దే! అతడి మనసులో ఉన్న లక్ష్యాన్ని ఎక్స్‌ప్రెషన్‌ ద్వారా బయటపెట్టినా, నటనలో దొరికిపోయినా కథ మొత్తం ఫెయిల్‌ అవుతుంది. చివరి వరకూ కూడా అతను బ్రిటీషర్ల కోసం పనిచేస్తున్న సోల్జర్‌లా ఉన్నాడే తప్ప, తండ్రి ఆశయం కోసం అక్కడున్నట్లు మనకు ఎక్కడా అనుమానం రాలేదు. కాబట్టి కష్టమైన పాత్ర రామ్‌చరణ్‌దే! ఏదేమైనా చరణ్‌, తారక్‌ ఇద్దరూ అద్భుతంగా నటించారు' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ.

చదవండి: ఎక్కువగా అబ్బాయి పాత్రలనే పోషించిన ఈ నటి గురించి తెలుసా?
పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్!

మరిన్ని వార్తలు