Paruchuri Gopala Krishna: వారియర్‌ మూవీలో మైనస్‌ అదే..

7 Oct, 2022 21:35 IST|Sakshi

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని కథానాయకుడిగా నటించిన చిత్రం ది వారియర్‌. లింగుస్వామి దర్శకుడిగా వ్యవహరించారు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాలోని ప్లస్‌, మైనస్‌లను విశ్లేషించాడు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఆయన మాట్లాడుతూ.. 'ప్రాణం పోసే డాక్టర్‌ జీవితం నుంచి ఒక రౌడీ ప్రాణం తీసే పోలీసాఫీసర్‌గా పరివర్తన చెందిన హీరో కథ ఇది. మానవుడు దానవుడు, సర్పయాగం వంటి హిట్‌ సినిమాలు ఇలాంటి కోవలోకే చెందుతాయి.

అయితే రామ్‌ పాత్రపై కొంత ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా ప్రభావం పడింది. సినిమాలో కీర్తి శెట్టితో లవ్‌ ట్రాక్‌, విలన్‌ డామినేషన్‌ బాగుంది. అలాగే గురు అంటే వ్యక్తి కాదు, జనం గొంతు మీద కత్తి అన్న డైలాగ్‌ ఎఫెక్టివ్‌గా ఉంది. కానీ హీరో తన ఫిర్యాదు వెనక్కుతీసుకోకుంటే బాగుండేది. హీరోయిన్‌ను కిడ్నాప్‌ చేసిన వారి దగ్గరి నుంచి విడిపించే సీన్‌ వేరేలా ఉంటే బాగుండేది. ఏదేమైనా రామ్‌ నటన అద్భుతం. ఇది చాలా బాగా ఆడాల్సిన కథ. దర్శకుడు స్క్రీన్‌ప్లేలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకొనుంటే ఇది ఘన విజయం సాధించి ఉండేది' అని చెప్పుకొచ్చాడు పరుచూరి.

చదవండి: లైగర్‌ బ్యూటీని కన్నెత్తి చూడని ఆర్యన్‌

మరిన్ని వార్తలు