Paruchuri Gopala Krishna: కార్తికేయ 2 డైరెక్టర్‌ సాహసం చేశాడు, హ్యాట్సాఫ్‌

21 Oct, 2022 21:43 IST|Sakshi

కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల ప్రళయాన్నే సృష్టించింది. యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది ఆగస్టు 13న రిలీజైన ఈ మూవీ రూ.130 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమాలోని బలాబలాలను విశ్లేషించాడు పరుచూరి గోపాలకృష్ణ. 'కష్టేఫలి అన్న సూత్రం నిఖిల్‌ విషయంలో నిరూపితమైంది. కార్తికేయ 2.. బడ్జెట్‌ కంటే నాలుగు రెట్లు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది. చందూ మొండేటి... ఈ జానపద కథను సాంఘిక కథగా మలిచి రాసినట్లు అనిపించింది. కథను నమ్మితే ఆ కథ ఎప్పుడూ మనల్ని మోసం చేయదు.

సినిమాలో తల్లి సెంటిమెంట్‌ను వాడుకున్నారు. ఇద్దరు కమెడియన్స్‌ను, హీరోయిన్‌ను హీరో పక్కన పెట్టుకున్నాడు. సామాన్యంగా ఇలాంటి సినిమాల్లో ప్రేమ మిస్‌ అవుతుంది. తెలివిగా చందూ మొండేటిగారు ఏం చేశారంటే ప్రతి ఫ్రేములోనూ హీరో హీరోయిన్‌ ఉండేలా జాగ్రత్తగా రాసుకున్నారు. మధ్యలో హీరోయిన్‌.. హీరోకు ఝలక్‌ ఇచ్చి వెళ్లిపోయినట్లు చీట్‌ చేసినా మళ్లీ తిరిగొచ్చినట్లు చేశారు. 

క్లైమాక్స్‌లో హీరో పాముల మధ్యలో నడుచుకుంటూ వెళ్లి హంసను తీసుకువచ్చి మురళీకి తగిలించి కృష్ణుడి చేతిలో పెట్టేవరకు కూడా  అద్భుతమైన స్క్రీన్‌ప్లే రాశారు చందు మొండేటి. నాలాగా చాలా సినిమాలు రాసిన కొద్దిమంది తప్ప మామూలు ప్రేక్షకులు దాన్ని క్యాచ్‌ చేయలేరు. చివర్లో కార్తికేయ 2కు సీక్వెల్‌ ఉంటుందని హింటిచ్చారు. చందూ మొండేటి అత్యంత సాహసం చేశారు. అతడి కెరీర్‌లో భారీ మొత్తంలో ఖర్చు పెట్టి సినిమా తీశారు. ఎవరికీ అమ్ముడుపోకుండా ప్రపంచానికి మంచి జరగాలనే కోరికతో దీన్ని ముగించారు. స్క్రీన్‌ప్లేలో ఎలాంటి దోషం లేదు. కావాలని కామెడీ సీన్స్‌ చొప్పించలేదు. కార్తికేయ 2ను కోట్లాది మంది చూడటం అంటే మామూలు విషయం కాదు. హీరో, దర్శకుడికి హ్యాట్సాఫ్‌' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ.

చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో నాగార్జున ఘోస్ట్‌, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
జైలుకు వెళ్లే డిజాస్టర్‌ కంటెస్టెంట్‌ ఎవరంటే?

మరిన్ని వార్తలు