Paruchuri Gopala Krishna: ఆ సీన్ చూస్తే రెండు సినిమాలు గుర్తొచ్చాయి: పరుచూరి

28 Jan, 2023 18:43 IST|Sakshi

మాస్ మహారాజా రవితేజ, ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ధమాకా'. విడుదలైన కొద్ది రోజుల్లోనే సూపర్‌ హిట్‌ టాక్ తెచ్చుకుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రవితేజ ఎనర్జీ, శ్రీలీల డ్యాన్స్‌ ప్రేక్షకులకు కట్టి పడేశాయి. తాజాగా ఈ చిత్రం ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన సమీక్షను వెల్లడించారు. ఈ సినిమా దర్శకుడు నక్కిన త్రినాథరావు స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆడుకున్నారని అన్నారు. రవితేజ డ్యూయల్ రోల్ ఈ చిత్రానికి అదనపు బలాన్నిచ్చిందని తెలిపారు. రావు రమేశ్ పాత్ర పూర్తిస్థాయి క్యారెక్టరైజేషన్ లేనప్పటికీ మెప్పించిందన్నారు. 

(అఫీషియల్: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న 'ధమాకా')

ఒక్క మాటలో చెప్పాలంటే తన తండ్రి కాని తండ్రి ఆస్తిని లాక్కోవాలని చూసే విలన్‌ పని పట్టిన ఓ హీరో కథే ఈ సినిమా. ఈ సినిమాలో రావు రమేశ్‌, శ్రీలీల పాత్రలు చూస్తే ఫర్‌ఫెక్ట్‌ క్యారెక్టరైజేషన్‌ అనేది అవసరం లేదని చెప్పడానికి ఉదాహరణలు. రచయిత ఎలాంటి కష్టం లేకుండా ఈ పాత్రలను సృష్టించాడు. రావురమేశ్‌ పక్కన హైపర్‌ ఆదిని పెట్టి వారిద్దరి సన్నివేశాలు అలా సరదాగా తీసుకెళ్లిపోతాయన్నారు.

హీరోని ఓ వ్యక్తి తలపై కొడితే అతడు కిందపడిపోవడంతో కథ మొదలవుతుంది. సాధారణంగా ఒక మాస్‌ హీరోకి ఇలాంటి ప్రారంభ సన్నివేశాలు ఉండవు. ఈ విషయంలో దర్శకుడు త్రినాథరావు చాలా ధైర్యం చేశారు. ఎక్కడా సస్పెన్స్ పెడతారో అక్కడ సెంటిమెంట్ పండదని దర్శకుడు నమ్మాడు. అందుకే అక్కడే ఆ ఇద్దరు రవితేజలు ఒక్కరనే విషయాన్ని ఇంటర్వెల్‌ ముందే చెప్పేశాడు. ఎవరికీ ఎవరనేది చెప్పేశారు. అలాగే  18 రోజుల క్రితమే ఏమై ఉంటుందనేదే కథలో ట్విస్ట్‌తో అక్కడే లాక్ చేశారు. ఇలా చేయడం వల్లే రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.110 కోట్ల వసూళ్లు రాబట్టిందని సినీ విశ్లేషకుల అంచనా. అంటే రూపాయికి రూపాయిన్నర లాభం వచ్చినట్టే.

ఆనంద చక్రవర్తి, నందగోపాల్ మధ్య ఆస్తి ఎవరూ తీసుకుంటారనేది ముందే చెప్పేశారు. అందులో ఎలాంటి ట్విస్ట్‌లు పెట్టలేదు. ఈ సినిమా ఏంటీ అంటే ప్రేక్షకులతో దర్శకుడు, రచయితలు ఆడుకున్నారు. ఒక్క క్షణం పక్కకు వెళితే సినిమా అర్థం కాదన్న రీతిలో ఆడుకున్నారు. అతను తాను కాదని చెబుతూ ప్రేక్షకులను ఫుల్స్ చేస్తున్న సీన్లు అద్భుతం. నేను విశాఖలో సినిమా చూశా. థియేటర్లో చూసేటప్పుడు ఆ ఫర్మామెన్స్ కనిపిస్తుంది. రవితేజ కవ్విస్తూ నవ్విస్తాడు. అతను ఎమోషన్‌లోనైనా ఒదిగిపోతారు రవితేజ అంటూ కొనియాడారు పరుచూరి. నక్కిన త్రినాథరావు స్క్రీన్‌ప్లేతో ఆడుకున్న తీరు అద్భుతం. స్క్రీన్ ప్లేతో ఆడుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఆ లిస్ట్‌లో చాలామంది గొప్ప దర్శకులు ఉన్నారు. 

(ఇది చదవండి: కలెక్షన్ల మోత మోగిస్తున్న రవితేజ)

సినిమాలో 'ఆ డైలాగ్.. నీలో నాకు విలన్ కనిపిస్తే.. నాలో నీకు హీరో కనిపిస్తాడురోయ్.' అనే డైలాగ్ తూకం వేసి మరీ రాసుకున్నారు. ఫైట్ సీన్లలో మాటలతో కట్టిపడేశాడు. అందులో మళ్లీ గాంధేయవాదం గురించి చెప్పారు. రావు రమేశ్ రవితేజకు నమస్కారం పెట్టగానే నేను నవ్వాను. నాకు రెండు సినిమాలు గుర్తొచ్చాయి. సమరసింహారెడ్డిలో సత్యనారాయణను చూడగానే నమస్కారం పెడితే అక్కడే అర్థమైపోతుంది. ఇంద్రలో కూడా ప్రకాశ్ రాజ్ చిరంజీవికి దండం పెడితే అంతే క్రేజ్ వచ్చింది. ఇదేదో నాకు చీటింగ్ షాట్‌లా అనిపించింది. ఇందులో ఉన్నట్లు కొన్ని పాత్రలు కన్‌ఫ్యూజన్ అనిపించింది. క్లైమాక్స్ పోలీస్ స్టేషన్‌లో మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ చిత్రంలో అన్యాయంగా ఒకరి సొమ్మును ఆక్రమించొద్దు అనే నీతిని అందించారు నక్కిన. ఇది నిజం. నీది నీదే. నాది నాదే. ఆయన ఇస్తే తీసుకుందాం అనేది మంచి సందేశం.

ఈ చిత్రంలో మరో ట్విస్ట్ ఏంటంటే రెండు రవితేజ క్యారెక్టర్స్ ఏంటీ అనేదే. ఈ సినిమా చూస్తే కచ్చితంగా మెచ్చుకుంటారు. పాత్రలన్నింటినీ దాచుకోకుండా రివీల్ చేస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రబృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు పరుచూరి గోపాలకృష్ణ. 
  

మరిన్ని వార్తలు