ఎత్తమంటే ఈ రేంజ్‌లోనా..: మీమ్స్‌ చూసి షాకైన నటి!

9 Jun, 2021 20:55 IST|Sakshi

బుల్లితెర నటి పవిత్ర లక్ష్మిని నెటిజన్లు ఓ ఆటాడేసుకుంటున్నారు. ఆమె షేర్‌ చేసిన ఫొటో మీద మీమ్స్‌ క్రియేట్స్‌ చేస్తూ తెగ హల్‌చల్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటారా? ఆ ఫొటోలే ఏం లేదు.. కానీ దానికిచ్చిన క్యాప్షన్‌లోనే ఉంది అసలు మ్యాటరంతా! తాపీగా కూర్చున్న ఫొటోను షేర్‌ చేసిన పవిత్ర 'నన్ను పైకి తీసుకెళ్లండి' అని రాసుకొచ్చింది. ఇంకేముందీ.. నెటిజన్లు ఆమెను పైకెత్తేందుకు సవాలక్ష ప్రయత్నాలు చేశారు.

గాల్లో ఎగిరే వాహనాల మీద పవిత్ర కూర్చున్నట్లు ఫొటో ఎడిట్‌ చేశారు. అంతేకాదు, ఓ హీరో గాల్లో నుంచి దూకుతుంటే అతడి భుజాల మీద కూర్చున్నట్లు, నలుగురు కలిసి ఆమెను మోస్తున్నట్లు, పై నుంచి ఆమెను ఎత్తిపడేసినట్లు.. ఇలా రకరకాలుగా ఎడిట్‌ చేశారు. మీమర్స్‌ తెలివితేటలు చూసి షాకైన పవిత్ర మరీ ఈ రేంజ్‌లోనా? అంటూ నవ్వేసింది. ఇక పవిత్ర లక్ష్మి కెరీర్‌ విషయానికి వస్తే.. 'కూకూ విత్‌ కోమలి' షోతో ఆమెకి పాపులారిటీ వచ్చింది. పలు షార్ట్స్‌ ఫిల్మ్స్‌లో నటించిన పవిత్ర 'ఉల్లాసం' అనే మలయాళ చిత్రంలోనూ కనిపించింది. కానీ ఇది ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.

చదవండి: సమంత కొడుకుగా అలరించనున్న స్టార్‌ హీరో కుమారుడు!

మరిన్ని వార్తలు