ప‌వ‌న్ 27: ప్రీలుక్ పోస్ట‌ర్ రిలీజ్‌

2 Sep, 2020 14:13 IST|Sakshi

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానుల‌కు మ‌రో స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే ఆయ‌న న‌టిస్తున్న 'వ‌కీల్ సాబ్' చిత్రం నుంచి మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. తాజాగా ప‌వ‌న్ 27వ సినిమా అధికారిక ప్రక‌ట‌న వెలువ‌డింది. పవ‌న్ క‌ల్యాణ్‌- క్రిష్ జాగ‌ర్ల‌పూడి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రం నుంచి ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో ప‌వ‌న్ చేతికి బంగారు రంగులో ఉన్న‌ క‌డియంతో పాటు రెండు వేళ్ల‌కు ఉంగ‌రాలు కూడా ఉన్నాయి. అలాగే న‌డుముకు ఎర్ర కండువా క‌ట్టుకున్నారు. దానికి గరుత్మంతుడి బొమ్మ‌కూడా ఉంది. ఈ వేష‌ధార‌ణ చూస్తుంటే ఇదేదో రాబిన్‌హుడ్ పాత్ర‌లా అనిపిస్తోంది. (ఆ వార్త నా మ‌నసును క‌లిచివేసింది: ప‌వ‌న్‌)

ఈ చిత్రం గురించి క్రిష్ మాట్లాడుతూ.. "ఈ సినిమా పదిహేను రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ హ్యాపీ బ‌ర్త్‌డే ప‌వ‌న్ క‌ల్యాణ్" అని ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఇదివ‌ర‌కే ప్రారంభమైంది. కానీ లాక్‌డౌన్ కార‌ణంగా చిత్రీక‌ర‌ణ‌ తాత్కాలికంగా వాయిదా ప‌డింది. సినిమా క‌థ విష‌యానికొస్తే మొఘ‌ల్ సామ్రాజ్యం నేప‌థ్యంలో పీరియాడిక‌ల్ డ్రామాగా రూపుదిద్దుకోనుంద‌ని భోగ‌ట్టా. ఈ సినిమాకు కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఏఎం ర‌త్నం నిర్మి‌స్తున్నారు. రామ్ ల‌క్ష్మ‌ణ్ ఫైట్లు కంపోజ్ చేస్తున్నారు. (పవన్‌ చిత్రంలో రామ్‌చరణ్‌?)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా