Bheemla Nayak Movie: ప్రత్యేక ఆకర్షణగా భీమ్లానాయక్‌ ఎలివేషన్‌ !

25 Mar, 2022 19:46 IST|Sakshi

Pawan Kalyan Bheemla Nayak Movie Elevation: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా ముఖ్య పాత్రల్లో నటించిన భీమ్లా నాయక్‌ ఫిబ్రవరి 25న విడుదలై విజయం సాధించింది. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైలాగ్స్, స్క్రీన్‌ ప్లే అందించారు. మ్యూజిక్‌ డైరెక్టర్ తమన్‌ సంగీతం అందించిన భీమ్లా నాయక్‌.. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్‌ కోషీయమ్‌కు రీమేక్‌గా వచ్చింది. ఇప్పుడు భీమ్లా నాయక్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి 24 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న భీమ్లానాయక్‌ మంచి టాక్ తెచ్చుకుంటుంది. 

ఈ సందర్భంగా డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి పవర్‌స్టార్‌ అభిమానులు ఓ వినూత్నమైన ఎలివేషన్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటుచేశారు. మార్చి 25 సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అభిమానులు పాల్గొన్నారు. ‘భీమ్లానాయక్‌’ సినిమాలో ఏ విధంగా అయితే పవన్‌ కల్యాణ్‌ జీపుపై కూర్చుంటాడో అదే తరహాలో జీపుపై పవన్‌ కటౌట్‌ను ఆవిష్కరించారు. ఓ క్రేన్‌కు వేలాడదీసిన ఈ జీపు నెక్లెస్‌ రోడ్‌లో అన్ని వైపులా కనిపించేలా చేయడంతో పాటుగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లోని పాటలతో  వీక్షకులలో ఆసక్తిని రేకిత్తించారు. 

మరిన్ని వార్తలు