'వ‌కీల్ సాబ్' మోష‌న్ పోస్ట‌ర్‌ విడుద‌ల

2 Sep, 2020 10:19 IST|Sakshi

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌డు(బుధ‌వారం) 49వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్టారు. ‘అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి' సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా రంగ‌ప్ర‌వేశం చేసిన ఆయ‌న ఎంద‌రో అభిమానుల‌కు దేవుడిగా మారే స్థాయికి ఎదిగిపోయారు. అయితే అనూహ్యంగా అన్న చిరంజీవి బాట‌లోనే ఆయ‌న కూడా రాజ‌కీయాల్లోకి వెళ్లి సినిమాల‌కు విరామం ఇవ్వ‌డంతో అభిమానులు నిరాశ‌కు గురయ్యారు. సుమారు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత "వ‌కీల్ సాబ్‌"తో తిరిగి సంద‌డి చేయ‌నున్నారు. నేడు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా 'వ‌కీల్ సాబ్' చిత్ర యూనిట్ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఉద‌యం 9 గంట‌ల 9 నిమిషాల‌కు ఈ పోస్ట‌ర్ విడుద‌లైంది. (ఆ రోజు ప‌వ‌న్ అభిమానుల‌కు డ‌బుల్ ధ‌మాకా)

ఇందులో మ‌హాత్మాగాంధీ, అంబేద్క‌ర్ వంటి మ‌హోన్న‌త వ్య‌క్తుల‌ను మొద‌ట చూపించారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ సూటు వేసుకుని లాయ‌ర్ గెట‌ప్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఒక చేత క్రిమిన‌ల్ లా పుస్తకం ప‌ట్టుకుని, మ‌రో చేత క‌ర్ర ప‌ట్టుకుని ఏ దారిలోనైనా నేరస్థుల‌ను వ‌దిలేదే లేద‌ని చెప్ప‌క‌నే చెప్తున్నారు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో "స‌త్యమేవ జ‌య‌తే" అంటూ వ‌స్తుండ‌టం మోష‌న్ పోస్ట‌ర్‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. కాగా శ్రీరామ్ వేను ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న 'వ‌కీల్ సాబ్' చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర బ్యాన‌ర్స్ క్రియేష‌న్స్‌పై దిల్‌ రాజు, బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీత‌మందిస్తున్నారు. ఇది బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘పింక్‌’ తెలుగు రీమేక్‌ అన్న విష‌యం తెలిసిందే (నిహారిక నిశ్చితార్థం: ప‌వ‌న్ అందుకే వెళ్ల‌లేదు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు