Pawan Kalyan: థియేటర్‌పై పవన్‌ అభిమానుల రాళ్లదాడి.. అద్దాలు ధ్వంసం

2 Sep, 2022 09:56 IST|Sakshi

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులు కర్నూలులోని శ్రీరామ థియేటర్‌పై దాడికి దిగారు. నేడు(శుక్రవారం)పవన్‌ పుట్టినరోజు సందర్భంగా శ్రీరామ థియేటర్‌లో 'జల్సా' సినిమా స్పెషల్‌ షోలు ప్రదర్శించారు. ఈ క్రమంలో భారీ ఎత్తున పవన్‌ ఫ్యాన్స్‌ సినిమా చూసేందుకు అక్కడికి వచ్చారు. అయితే థియేటర్‌లో సౌండ్‌ సిస్టం సరిగాలేదని అభిమానులు ఆందోళనకు దిగారు.

థియేటర్‌పై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో థియేటర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇక  ఇదిలా ఉండగా పవన్‌ నేడు 51 వసంతంలోకి అడుడుపెడుతున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి  సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పవన్‌  'హరిహరి వీరమల్లు' అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది.

మరిన్ని వార్తలు