హాట్‌ టాపిక్‌గా మారిన పవన్‌ కల్యాణ్ రెమ్యూనరేషన్‌

23 Apr, 2021 12:24 IST|Sakshi

వచ్చే నెలలో ఓటీటీలో రానున్న వకీల్‌సాబ్‌

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ వకీల్‌సాబ్‌. దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత పవన్‌ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.  ఏపప్రిల్ ‌9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాలో పవన్‌ లాయర్‌గా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. వకీల్‌సాబ్‌కు కోసం పవన్‌ కళ్యాణ్ ఏకంగా 65 కోట్లు తీసుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. రెమ్యూనరేషన్‌గా 50 కోట్ల, లాభాల్లో 15 కోట్లు వాటాగా తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో నటించిన నివేదా థామస్‌కు 75 లక్షలు, అంజలి 50 లక్షలు, అనన్యకు 25 లక్షలు పారితోషికంగా అందినట్లు తెలుస్తోంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌కు సైతం భారీ రెమ్యూనరేషనే ఇచ్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 

మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలుచోట్ల ఆంక్షలు విధించారు. తెలంగాణలో థియేటర్లు, మల్టీఫ్లెక్స్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు  సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్  వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చాలా చోట్ల 50% ఆక్యుపెన్సీతో థియేటర్లు కొనసాగుతున్నాయి. దీంతో వకీల్‌సాబ్‌ మూవీను త్వరలోనే ఓటీటీలో రిలేజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చేనెలలో ఈ మూవీ అమెజాన్‌ పప్రైమ్‌లో రిలీజ్‌ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

చదవండి: అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్‌ ‌
'అతని వల్లే ఆర్తి అగర్వాల్ కెరీర్‌ ఫేడ్‌ అవుట్‌ అయ్యింది'

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు