పవన్‌ ఫ్యాన్స్‌కు మరో బిగ్‌ సర్‌ప్రైజ్

2 Sep, 2020 17:20 IST|Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు నేడు (సెప్టెంబర్‌ 2). ఈ సందర్భంగా అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు అందుతున్నాయి. తొలుత వ‌కీల్ సాబ్ మోషన్‌ పోస్టర్‌, ఆ త‌ర‌వాత‌, పవ‌న్ ‌- క్రిష్ జాగ‌ర్ల‌మూడి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను చూసే అవ‌కాశం వ‌చ్చింది. ఇప్పుడు.. హ‌రీష్ శంక‌ర్ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ కూడా వ‌చ్చేసింది. (చదవండి : ప‌వ‌న్ 27: అభిమానుల‌కు మ‌రో ట్రీట్‌)

‘గబ్బర్‌సింగ్‌' విజయం తర్వాత ప‌వ‌ర్ స్టార్  పవన్‌కల్యాణ్‌, దర్శకుడు హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌ మరో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఎనిమిదేళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో దీని పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ వ‌దిలింది చిత్ర‌బృందం. (చదవండి : 'వ‌కీల్ సాబ్' మోష‌న్ పోస్ట‌ర్‌ విడుద‌ల)

స్టైలీష్ బైక్‌, సీటుపై పెద్ద బాల‌శిక్ష పుస్తకం, ఓ గులాబీ పువ్వుతో పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌, సుభాష్ చంద్ర‌బోస్ ఫొటోలూ బ్యాక్ గ్రౌండ్ లో క‌నిపిస్తున్నాయి. `ఈసారి కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంటే కాదు..` అంటూ.. హ‌రీష్ హింట్ ఇచ్చేశాడు. ఇక  ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ  ఈ చిత్రాన్ని నిర్మించనున్నది.  ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్‌తో పాటు సంగీతానికి సంబంధించిన పనులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మొత్తానికి మరోసారి గబ్బర్‌సింగ్‌ మ్యాజిక్‌ రిపీట్‌ కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా