Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' నుంచి పోస్టర్‌ రిలీజ్‌

1 Sep, 2022 18:29 IST|Sakshi

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న తాజాచిత్రం 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగ‌ర్ల‌మూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. రేపు(శుక్రవారం)పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది మూవీ టీం.

'స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం' అనే క్యాప్షన్‌తో దర్శకుడు క్రిష్‌ ఈ పోస్టర్‌ను షేర్‌ చేశాడు. అంతేకాకుండా రేపు సాయంత్రం 5.45గంటలకు  పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. 

మరిన్ని వార్తలు