ఆ పాట విని ‘వనవాసి’గుర్తుకొచ్చింది : పవన్‌

24 Dec, 2020 11:06 IST|Sakshi

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్ ముగిశాక ఓ షెడ్యూల్‌లో పాల్గొన్న ఆయన కాస్త విరామం తీసుకున్నారు. తాజాగా కీలక సన్నివేశాల చిత్రీకరణ మళ్లీ సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్లాష్ బ్యాక్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇక షూటింగ్‌లో భాగంగా అరకు వెళ్లిన పవన్‌.. అక్కడి ఆదివాసీలతో కాసేపు సరదాగా గడిపాడు. షూటింగ్‌ విరామ సమయంలో ఆదివాసీల జీవన స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు పాట రూపంలో వారి స్థితిగతుల్ని వపన్‌కు వివరించారు.

ఈ వీడియోని స్వయంగా పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. ‘నిన్న  'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల  ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో  ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని  వివరిస్తూ పాడే పాట .. ( వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ' వనవాసి'  గుర్తుకువచ్చింది)’అని పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు.
 
హిందీ ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న‘వకీల్‌ సాబ్‌’కు వేణు శ్రీరామ్ దర్శకుడు. నివేదా థామస్, అంజలి,శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు.
 

మరిన్ని వార్తలు